- విధులు శ్రద్ధగా నిర్వహించాలి
- తాంసీ సర్వసభ్య సమావేశంలో అటవీశాఖ మంత్రి జోగు రామన్న
అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు
Published Wed, Aug 17 2016 12:04 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
తలమడుగు (తాంసి) : ప్రభుత్వం అనేక అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని తాంసీ సర్వసభ్య సమావేశంలో మంత్రి జోగురామన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తాంసీ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా సమావేశంలో మొదటి ఎజెండా అంశం వ్యవసాశాయ శాఖ సమీక్ష కాగా వ్యవసాయ శాఖ అధికారులు వారి నివేదికను చదివి వినిపించారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటివరకు ఎంత మంది రైతులకు ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారని అధికారులను ప్రశ్నించారు. దీనికి అధికారులు సరైన సమాధానం చెప్పకపోయే సరికి మంత్రి వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో రుణాలు తీసుకుని రైతుల వివరాలు, కారణం తెలపాలని ఆదేశించారు. జల్కోరి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం భవన నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోవడంతో ఎందుకు పనులు నిలిచిపోయాయని సంబంధిత అధికారుల్ని మంత్రి ప్రశ్నించారు. సంబదిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, టెండర్ రద్దు చేయాలని పంచాయతీ రాజ్ ఏఈ గులబ్‌ని ఆదేశించారు. అటవీప్రాంతంలో మొక్కలు నాటాలని శాఖ అధికారులను ఆదేశించారు. బెల్షారిరాంపుర్ గ్రామ సర్పంచ్‌ను గ్రామ కార్యాదర్శి గంగన్న ఇష్టమెచ్చినట్లుగా మాట్లాడుతున్నాడని వెంటనే అతడిని విధులనుంచి తొలగించాలని పలువురు మంత్రికి విన్నవించారు.
అనతరం తాంసీ జెడ్పీ పాఠశాలలో మంత్రి మొక్కలు నాటారు. గ్రామంలో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. కేజీబీవీ పాఠశాలలో తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ ముడుపు దమోదర్‌రెడ్డి, సాక్షరభారత్ డీడీ దుర్గాభవాని, ఎంపీపీ మంజుల శ్రీధర్‌రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత నారాయణ, ఎంపీడీవో భూమయ్య, ఇరిగేషన్ డీఈ ప్రతాప్, డీటీ మధూకర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement