అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు
చేజర్ల : విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మామూడూరు, గొల్లపల్లి, చేజర్ల గ్రామాల్లో జరుగుతున్న స్మార్ట్ పల్స్ సర్వేను ఆయన పరిశీలించారు.
చేజర్ల : విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మామూడూరు, గొల్లపల్లి, చేజర్ల గ్రామాల్లో జరుగుతున్న స్మార్ట్ పల్స్ సర్వేను ఆయన పరిశీలించారు. సర్వే తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన మామూడూరు వీఆర్వో మాలకొండయ్యకు, పెళ్లేరు వీసీఓ మాతయ్యకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు. ఎన్యూమరేటర్లు ఉదయం 6 గంటల నుంచి 12 గంటలలోగా సర్వే ప్రారంభిస్తే సర్వరు, సిగ్నెల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా ఉదయం 6 గంటలకు విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ఆయన వెంట yì ప్యూటీ ఎస్‌ఓ సుధాకర్‌రావు, చేజర్ల ఏఎస్‌ఓ రఫీహుద్దీన్ అన్సారీ, డీటీ బాలాజీ ఉన్నారు.
పలు గ్రామాల్లో పరీశీలన
అనుమసముద్రంపేట : మండలంలోని వేల్పులగుంట, హనాపురం, శ్రీకొలను చిరమన తదితర గ్రామాల్లో జరుగుతున్న సర్వేను తహసీల్దారు ఐ.మునిలక్ష్మి పరిశీలించారు. డివిజన్‌లో మండలాన్ని మొదటిస్థానంలో నిలిపేందుకు అందరూ ఈ సందర్భంగా ఆమె అన్నారు.