chejarla
-
తమ్ముడిని కడతేర్చిన అన్న
సాక్షి, ఆత్మకూరు (నెల్లూరు): ఇల్లు పంపకం విషయంలో సొంత అన్నదమ్ముల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు తమ్ముడి ప్రాణం తీసింది. ఈ ఘటన చేజర్ల మండలంలోని కాకివాయిలో ఆదివారం జరిగింది. స్థానికులు, చేజర్ల ఎస్సై ఎన్.కాంతికుమార్ సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన మస్తానయ్య, చినమస్తానయ్య ఇద్దరూ సోదరులు. వీరికి మరో చెల్లెలు ఉంది. కాలనీ ఇల్లు మంజూరు కావడంతో రెండేళ్ల క్రితం నిర్మించుకున్నారు. అప్పటికే ఓ ఇల్లు ఉండగా కాలనీ ఇల్లు చెల్లెలికి ఇవ్వాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే చిన మస్తానయ్య (40) ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. అయినా చెల్లెలుకు, తల్లికి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఎలాంటి ఆదరువు లేని చెల్లెలకు కాలనీ ఇల్లు ఇద్దామని చెప్పినా ఒప్పుకోక పోవడంతో గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మరోసారి అన్నదమ్ముల మధ్య ఇంటి విషయమై గొడవ జరిగింది. ఆవేశంలో అన్న మస్తానయ్య తమ్ముడు చినమస్తానయ్యను కర్రతో తలపై కొట్టడంతో తల పగిలి తీవ్రగాయమై అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. వెంటనే నెల్లూరులోని వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం తెల్లవారు జామున చెన్నైకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న చేజర్ల ఎస్సై ఎన్ కాంతికుమార్ గ్రామానికి చేరుకుని విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. -
పశువులకూ ‘ఆధార్’
సాక్షి, చేజర్ల: పశువులకు ఆధార్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్షన్ అండ్ హెల్త్ (ఇనాఫ్) ట్యాగింగ్ పేరిట ప్రతి పశువుకు ట్యాగింగ్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో పాలు ఇచ్చే పశువులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత మిగిలిన వాటికి ట్యాగింగ్ చేస్తారు. సుమారు మూడు నెలల క్రిందట ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మొదలయినప్పటికీ ఇంతవరకు కేవలం 21 శాతం మాత్రమే పూర్తయింది. ఫిబ్రవరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పశుగణన ప్రారంభం కావడంతో ఆధార్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధానంగా ట్యాగింగ్ పశువుల చెవులకు వేస్తారు. ఆ సమయంలో చెవికి రంధ్రం పెడతారు. అలా చేస్తే పశువుల విలువ పడిపోతుందనే భావన రైతుల్లో ఉంది. దీంతో చాలా మంది రైతులు ట్యాగింగ్‌కు అనాసక్తి చూపుతూ ముందుకు రావడం లేదు. ఈ ప్రక్రియ చేపట్టవద్దని పలు మండలాల్లో రైతులు పశువైద్యాధికారులను కోరుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 1.10లక్షలకు పైగానే ఆవులు, గేదెలు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం పాలిచ్చే పశువులకు మాత్రమే తొలివిడతగా ఆధార్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. పాలిచ్చే ఆవులు, గేదెలు నియోజకవర్గంలో 70 వేలకు పైగానే ఉన్నాయి. వీటిలో 20 శాతం మాత్రమే గోపాలమిత్రలు ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రతి పశువుకు ట్యాగింగ్ అనేది అత్యంత ముఖ్యమైనదని పశువైద్యాధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో దీని ఆధారంగానే పశుపోషకులకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని వెల్లడిస్తున్నారు. అలాగే ట్యాగ్‌లను ఆం«ధప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ వారు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంపై ప్రచారం నోచుకోకపోవడంతో రైతులు ముందుకు రావడంలేదు. మండలం గేదెల సంఖ్య చేజర్ల 1,8000 అనంతసాగరం 1,7500 మర్రిపాడు 1,6000 ఏఎస్‌పేట 1,2000 సంగం 1,4000 ఆత్మకూరు 1,5000 -
సార్లకు సమయపాలనే లేదు
ఉదయం 10.30 గంటలైనా తెరుచుకోని ప్రభుత్వ కార్యాలయాలు ఇబ్బందులుపడుతున్న కార్యార్ధులు చేజర్ల : చేజర్లలో ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, సిబ్బందికి వేళకు రాకపోవడం షరామామూలే అయిపోయింది. దీంతో కార్యార్ధులు పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్నీకావు. శుక్రవారం చేజర్లలో ప్రభుత్వ కార్యాలయాలను విజిట్ చేయగా ఈ విషయం మరోమారు బయటపడింది. ఉదయం 10.30 గంటలైనా వెలుగు కార్యాలయం తలుపులు తీయలేదు. అదే సమయానికి వివిధ పనులపై ఈ కార్యాలయానికి అనేకమంది మహిళలు వచ్చారు. దీనిపక్కనే ఉన్న వ్యవసాయాధికారి కార్యాలయం తలుపులు ఉయదం 10:30 గంటలు దాటినా తీయలేదు. ఇన్పుట్ సబ్సిడీ వివరాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలకోసం వచ్చిన రైతులు కార్యాలయం పక్కనే పడిగాపులుకాస్తూ కనిపించారు. మామూలుగా తహసీల్దార్ కార్యాలయం ఉదయం 7, 8 గంటల నుంచే కిటకిటలాడుతూ ఉంటుంది. సిబ్బంది వచ్చేసి ఉంటారు. అయితే చేజర్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 10 గంటలకు అక్కడ ఒక్కరు కూడాలేరు. వివిధ గ్రామాలనుంచి వచ్చిన ప్రజలు రేషన్‌కార్డుల్లో మార్పులు, చేర్పులు, విద్యార్థులు సర్టిఫికెట్లు వచ్చి ఎదురుచూశారు. వీఆర్వోల కోసం గంటలతరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది అయితే మధ్యాహ్నం 12 గంటలకు కూడా వస్తునేఉన్నారు. అధికారులు, సిబ్బందిలో చాలామంది బయటిప్రాంతాలకు చెందినవారు ఉండటంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రీక్ ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఏసీబీ అధికారుల దర్యాప్తు
చేజర్ల : ఇటీవల అవినీతి నిరోధకశాఖ వలలో చిక్కిన సంగం తహసీల్దారు సుశీలకు సంబంధించి చేజర్ల మండలంలో ఉన్న ఆస్తులపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. గురువారం ఏసీబీ సీఐ శివకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది చేజర్ల, మడపల్లి, యనమదాలలో సుశీలకు సంబంధించిన వ్యవసాయ భూములు, ఆస్తులను పరిశీలించి వివరాలను సేకరించారు. ఆకస్మికంగా ఏసీబీ అధికారులు మండలానికి రావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. -
గేదె గొంతులో ఇరుకున్న తాటిముట్టెలు
చేజర్ల : మండలంలోని గాలిపాళెంలో కామాటి వెంకటేశ్వర్లుకు చెందిన గేదె తాటిముట్టెలు తినింది. అయితే అవి గొంతు భాగంలో ఇరుక్కుపోయాయి. దీంతో అది అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. మంగళవారం గుర్తించిన యజమాని వెంటనే చేజర్ల పశువైద్యులు డాక్టర్ మురళీకష్ణారెడ్డి, పెళ్లేరు పశువైద్యులు డాక్టర్ Mýష్ణమోహన్లకు సమాచారం అందించారు. వారొచ్చి కొనప్రాణంతో ఉన్న గేదెకు మూడుగంటల పాటు శస్త్ర చికిత్స చేసి తాటిముట్టెలను బయటకు తీశారు. దీంతో గేదెకు ప్రాణాపాయం తప్పింది. -
అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు
చేజర్ల : విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆత్మకూరు ఆర్డీఓ ఎంవీ రమణ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మామూడూరు, గొల్లపల్లి, చేజర్ల గ్రామాల్లో జరుగుతున్న స్మార్ట్ పల్స్ సర్వేను ఆయన పరిశీలించారు. సర్వే తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన మామూడూరు వీఆర్వో మాలకొండయ్యకు, పెళ్లేరు వీసీఓ మాతయ్యకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలన్నారు. ఎన్యూమరేటర్లు ఉదయం 6 గంటల నుంచి 12 గంటలలోగా సర్వే ప్రారంభిస్తే సర్వరు, సిగ్నెల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్యూమరేటర్లు తప్పనిసరిగా ఉదయం 6 గంటలకు విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ఆయన వెంట yì ప్యూటీ ఎస్ఓ సుధాకర్‌రావు, చేజర్ల ఏఎస్ఓ రఫీహుద్దీన్ అన్సారీ, డీటీ బాలాజీ ఉన్నారు. పలు గ్రామాల్లో పరీశీలన అనుమసముద్రంపేట : మండలంలోని వేల్పులగుంట, హనాపురం, శ్రీకొలను చిరమన తదితర గ్రామాల్లో జరుగుతున్న సర్వేను తహసీల్దారు ఐ.మునిలక్ష్మి పరిశీలించారు. డివిజన్లో మండలాన్ని మొదటిస్థానంలో నిలిపేందుకు అందరూ ఈ సందర్భంగా ఆమె అన్నారు. -
చేజర్లలో చిరుజల్లులు
చేజర్ల : మండలంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గతవారం రోజుల నుంచి తీవ్ర ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలు ఒక్కసారిగా వర్షం కురిసి వాతావరణం చల్లపడటంతో ఉపశమనం పొందారు. సాగరంలో.. సోమశిల : అనంతసాగరం మండలంలో ఆదివారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. అనంతసాగరం, కొత్తపల్లి, రేవూరు, శంకరనగర్ గ్రామాల్లో విపరీతమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో మెట్టరైతుల్లో ఆశలు చిగురించాయి. -
పోలీస్ స్టేషన్లో పేలుడు
నెల్లూరు: పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు జరిగి పెను ప్రమాదం తప్పిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు... చేజర్ల పోలీసులు మూడు నెలల క్రితం ఓ బాణా సంచా తయారీ కేంద్రంపై దాడి చేసి అక్కడ ఉన్న బాణా సంచాను తీసుకు వచ్చి పోలీస్ స్టేషన్ అవరణలో పూడ్చిపెట్టారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో బాణా సంచా పూడ్చిన ప్రదేశంలో గురువారం నుంచే స్వల్పంగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. చుట్టు పక్కల ఇళ్లపై పేలుడు పదార్ధాలు పడి ఇంటి రేకులు గాలిలో ఎగిరిపోయాయి. పనివేళల్లో ఈ సంఘటన జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగేదని స్తానికులు తెలిపారు. ఈ సంఘటనతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. రెండురోజులు నుంచి పేలుడు సంభవిస్తున్నా పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతంగా కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (చేజెర్ల) -
బాణాసంచి పేలి పోలీస్‌స్టేషన్ ధ్వంసం