కారు బోల్తా: ఎనిమిది మందికి గాయాలు | Car roll over, eight injured | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: ఎనిమిది మందికి గాయాలు

Published Tue, Sep 13 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

Car roll over, eight injured

ఘట్‌కేసర్‌: బైక్‌ ఢీకొట్టి ఇన్నోవా బోల్తాపడిన ఘటనలో ఎనిమిది మంది గాయపడిన సంఘటన ఘట్‌కేసర్‌ మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఏదులాబాద్‌కు చెందిన అంజన్‌కుమార్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం బైక్‌పై డ్యూటీకి వెళుతుండగా బైపాస్‌ రోడ్డులోని మైసమ్మగుట్ట దేవాలయ సమీపంలో వరంగల్‌ వైపు వెళతున్న ఇన్నోవా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీనిని చూసిన అంజన్‌కుమార్‌ పక్కకు తప్పుకోగా కారు బైక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. అంజన్‌కుమార్‌కు స్వల్పగాయాలు కాగా, కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాస్, గోపి, మేఘనాధ్, మేకలింగం, ప్రవళిక, వనజాక్షి్మ, డ్రైవర్‌ రాజుకు గాయపడ్డారు. గాంధీనగర్‌కు చెందిన వారు వరంగల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement