స్టీల్ పైప్స్, ట్యూబ్స్ పై యాంటీ డంపింగ్ సుంకం | Anti-dumping duty imposed on steel pipes, tubes from China | Sakshi
Sakshi News home page

స్టీల్ పైప్స్, ట్యూబ్స్ పై యాంటీ డంపింగ్ సుంకం

Published Thu, May 19 2016 1:02 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM

స్టీల్ పైప్స్, ట్యూబ్స్ పై యాంటీ డంపింగ్ సుంకం

స్టీల్ పైప్స్, ట్యూబ్స్ పై యాంటీ డంపింగ్ సుంకం

న్యూఢిల్లీ: చైనా నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్ పైప్స్, సీమ్‌లెస్ ట్యూబ్స్‌పై  కేంద్ర ప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. చౌక దిగుమతుల బారినుంచి దేశీ స్టీల్ పరిశ్రమను ఆదుకోవాల్సి ఉందని, అందులో భాగంగా ఆయిల్, గ్యాస్ అన్వేషణలో ఉపయోగించే స్టీల్ పైప్స్, ట్యూబ్స్‌పై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని డెరైక్టరేట్ జనరల్ ఫర్ యాంటీ డంపింగ్ అండ్ అలీడ్ డ్యూటీస్ (డీజీఏడీ) ఇటీవల రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు ఒక ప్రతిపాదన చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కొన్ని స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించిందని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) తెలిపింది. ఇది 961.33-1,610.67 డాలర్ల శ్రేణిలో ఉంటుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement