- జిల్లా న్యాయమూర్తి రేణుక
కరీంనగర్‌కు రావడం సంతోషంగా ఉంది
Published Mon, Aug 1 2016 11:28 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
కమాన్‌చౌరస్తా: జిల్లాకు ప్రధాన న్యాయమూర్తిగా రావడం సంతోషంగా ఉందని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రేణుక అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్ భవనంలో ఉద్యోగ విరమణ పొందిన న్యాయమూర్తి బి.నాగమారుతీశర్మకు కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాగమారుతీశర్మ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి మంచిపేరు తెచ్చుకున్నారన్నారు. న్యాయమూర్తి నాగమారుతిశర్మ మాట్లాడుతూ న్యాయవాదుల సహకారంతో కేసులను సత్వరగా పరిష్కరించవచ్చని, అందరూ ఆదరించడం మన్ననలు పొందానని చెప్పారు. జిల్లాలోనే మేజిస్ట్రేట్ ప్రారంభమై ఇక్కడే విరమణ పొందడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి.రఘునందన్‌రావు, ఉపాధ్యక్షుడు పీవీరాజ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు సత్కరించారు. బార్ కౌన్సిల్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్‌కుమార్, బార్ అసోయేషన్ మాజీ సంజీవరెడ్డి, జగదీష్‌చందర్‌రావు, కొరివి వేణుగోపాల్, బాససత్యనారాయణరావు, ప్రభుత్వ న్యాయవాది గీతారెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాంరెడ్డి, వెంకటనర్సింగారావు, ముస్కుల సత్యనారాయణ, ఎర్రం రాజిరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement