విధులకు హాజరైన డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి | dmho attend duties | Sakshi
Sakshi News home page

విధులకు హాజరైన డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి

Published Tue, Dec 20 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

dmho attend duties

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ యు.స్వరాజ్యలక్ష్మి సోమవారం విధులకు హాజరయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై గత శుక్రవారం ఏసీబీ అధికారులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. కర్నూలుతో పాటు గతంలో ఆమె పనిచేసిన విజయనగరం, విశాఖపట్టణంలోనూ సోదాలు చేసిన విషయం విదితమే. సోదాల సమయంలో ఆమె బ్యాంకు అకౌంట్లు, లాకర్లు, రికార్డులు, బీరువాలు, కంప్యూటర్లను తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల అనంతరం సోమవారం సాయంత్రం ఆమె తిరిగి విధులకు హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement