: పాతాళగంగ వద్ద సమావేశమైన అధికారులు
బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
Published Fri, Aug 5 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
పాతాళగంగ (మన్ననూర్) : కృష్ణా పుష్కరాల్లో ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పుష్కరాల నిర్వహణ ప్రత్యేక అధికారులు మధుసూదన్‌నాయక్, డాక్టర్ వెంకటయ్య ఆదేశించారు. శుక్రవారం పాతాళగంగ వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సిబ్బందితో వారు మాట్లాడారు. 12రోజులపాటు నిర్వహించే పుష్కరాల్లో క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కృష్ణవేణి, వనమయూరి, మన్ననూర్‌లోని వనమాలికలో వీఐపీల కోసం ప్రత్యేక వసతి ఏర్పాటు చేశామన్నారు. మీడియా పాయింట్ వద్ద రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోని, ఉపసర్పంచ్ ప్రసాద్, నాగర్‌కర్నూల్ డీఎస్పీ ప్రవీణ్‌కుమార్, అచ్చంపేట ఆర్టీసీ డీఎం నారాయణ, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ రఘునందన్, సీఐ శ్రీనివాస్, ఆర్‌ఐ కృష్ణాజీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement