విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
Published Wed, Aug 21 2013 4:39 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
మద్నూర్,న్యూస్‌లైన్: వైద్యులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మండల కేంద్రం లోని కమ్యూనిటీహెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించి, సిబ్బం దిని వివరాలు అడిగారు. రికార్డులో గల ఆస్పత్రి వైద్యులు,సిబ్బంది డ్యూటీలో లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వేల రూపాయల జీ తాలు ఇస్తూ, రోగులకు ఎల్లవేళలా సేవలు అందించాలని సూచించినప్పటికీ, నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని మండిపడ్డారు. ఆస్పత్రిలోని కాంట్రాక్ట్ వైద్యులు దేవీసింగ్,అమిత్‌కుమార్‌లు సెలవు పెట్టకుండా విధులకు హాజరుకావడంలేదని దృష్టికి రావడంతో వారిని విధుల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు.
వారితో పాటు ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గో తరగతి సిబ్బంది ఇక్బాల్ అహ్మద్,మన్సూర్‌లను సస్పెండ్ చే యాలని ఆదేశించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ నితి న్‌శెట్టిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా లో ఖాళీగా ఉన్న ఆస్పత్రుల్లో డాక్టర్,నర్సుల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రోగులకు అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం మోడల్ పాఠశాలను పరిశీలించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు,సిబ్బంది లేకపోవడం,పుస్తకాలు రాకపోడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాఠశాల ప్రిన్స్‌పాల్ సతీశ్ తెలిపారు. త్వరలో పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను నియమించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.పాఠశాలలో ఎలా బోధిస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Advertisement