ఉయ్యూరు, న్యూస్‌లైన్ : ఉయ్యూరు కేసీపీ కర్మాగారంలో 2013-14 సీజన్‌కు సంబంధించి క్రషింగ్ ప్రారంభమైంది. సంస్థ చైర్మన్ వినోద్.ఆర్.సేథి సోమవారం రాత్రి 9.58 గంటలకు స్వీచాన్ చేసి లాంఛనంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా కర్మాగార ఆవరణలో చెరుకు లోడుతో ఉన్న ట్రక్కుకు ప్రత్యేక పూజలు నిర్వహించి తొలి పర్మిట్ విడుదల చేశారు. సేథి మాట్లాడుతూ చెరుకు రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంస్థ పనిచేస్తున్నట్లు చెప్పారు. టన్ను మద్దతు ధర రూ.2400 ప్రకటించామన్నారు.
దేశంలో ఏ కర్మాగారమూ అమలు చేయని రాయితీలను ఇక్కడ రైతులకు ఇస్తున్నామన్నారు. రైతు ఆపదలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఆదుకునే చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కర్మాగారానికి లాభాలు వచ్చినప్పుడు వాటిలో కొంత రైతులకు పంచుతున్న ఘనత తమదేనన్నారు. రైతులకు సీజన్ ముగిసేలోపే పూర్తి చెల్లింపులు జరుపుతున్నామన్నారు. 14 రోజులకే తొలి పేమెంట్ అందిస్తున్నామన్నారు. ఈ విధంగా చెల్లింపులు మరెక్కడా లేవన్నారు. రైతులంతా కర్మాగారానికి సకాలంలో చెరుకు రవాణా చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీవోవో జీ వెంకటేశ్వరరావు, జీఎంలు వీవీ పున్నారావు (కేన్), కే కృష్ణ (పరిపాలన), సీకే వసంతరావు (ఫైనాన్స్), హరిబాబు (ప్రాసెస్), డీజీఎం సీతారామారావు (ఇంజినీరింగ్), సీడీసీ చైర్మన్ నెరుసు సతీష్, కార్యదర్శి సత్యనారాయణ, చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్‌వీ కృష్ణారావు, కార్యదర్శి భాగ్యనిరంజనరావు తదితరులు పాల్గొన్నారు.
క్రషింగ్ ప్రారంభం
Published Tue, Nov 19 2013 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement