సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించేందుకు అనుమతులున్నా.. ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కాంగ్రెస్ పార్టీ నేత చెరుకు శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అఖ్తర్, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది.
‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజులు తరలించేందుకు వీలుగా పనులు చేశారు. అయితే రోజుకు 3 టీఎంసీల చొప్పున 270 టీఎంసీలను రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోంది. దీనిపై వాదనల అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment