సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలైంది.
టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నిరంజన్ ఈ పిటిషన్ వేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్‌లో నమోదు అయిన కేసును సీబీఐకి బదిలీ చేయాలని పిటీషన్‌లో కోరారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన అంశంపై పిటిషనర్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగిన ఘటన జరిగిన సమయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను అనుసరించి రాష్ట్ర సీఎస్‌కు లేఖ రాసిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి. సీఎస్ నుండి సమాచారం తీసుకుని రెండు వారాల్లోపు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment