పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి సీఎం కేసీఆర్ మద్దతు పలకడం సంతోషకరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు.
హైదరాబాద్: పాత పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహోసోపేత నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలకడం సంతోషకరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా విమర్శలు చేస్తోందని అన్నారు.
కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తమలాగే బ్యాంకు లావాదేవీలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. మోదీ నిర్ణయానికి కేసీఆర్ మద్దతు పలకడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన నేపథ్యంలో లక్ష్మణ్ ఈవిధంగా స్పందించారు.