Cash Ban
-
ఆర్బీఐ ఆ నోట్లను రద్దెప్పుడు చేసిందో తెలుసా?
పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగం. ఈ ప్రసంగానికి కొన్ని గంటల ముందే అంటే సాయంత్రం 5.30 గంటలకే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆమోదించేసిందట. అయితే ఈ విషయానికి ఎంతమంది మద్దతిచ్చారు, ఎంతమంది అనుకూలించారో మాత్రం ఆర్బీఐ రికార్డు చేయలేదు. సమాచార హక్కు చట్టం కింద కోరిన ప్రశ్నలకు సమాధానంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించిందని బ్లూమ్‌బర్గ్ న్యూస్ రిపోర్టు చేసింది. నవంబర్ ఎనిమిదిన బోర్డు మీటింగ్ నిర్వహించిన ఆర్బీఐ సాయంత్రం 5.30 గంటలకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ఆమోదించిందని ఆర్టీఐలో వెల్లడైంది. అనంతరం ప్రధాని రాత్రి ప్రసంగంలో తెలిపారు. బ్యాంకు బోర్డు మీటింగ్‌లో గవర్నర్ ఉర్జిత్ పటేల్, ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు. ఆర్. గాంధీ, ఎస్ఎస్ ముంద్రా, వీఎస్ విశ్వనాథన్‌లతో పాటు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ వంటి పలువురు ప్రముఖులున్నారు. అయితే కరెన్సీ రద్దుతో ఏర్పడే నగదు కొరతకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు ప్లాన్స్ సిద్ధం చేసుకుందో ఆర్బీఐ తెలుపలేదు. రోజుకు ఎన్ని కొత్త రూ.500, రూ.2000 నోట్లు ప్రింట్ చేస్తున్నారనే దానిపై కూడా ఆర్బీఐ సమాధానం చెప్పలేదు. పెద్ద నోట్లు రద్దయి 50 రోజులు గడుస్తున్నా ఇంకా నగదు కొరత సమస్య వెంటాడుతూనే ఉంది. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిరీక్షిస్తూనే ఉన్నారు. దేశంలో చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని నిరుపయోగంగా మార్చేస్తూ పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన పలు పరిణామాల్లో ఆర్బీఐ పలు సార్లు తడబడిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆర్బీఐ పలు విమర్శలు ఎదుర్కొంటుంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో సెంట్రల్ బ్యాంకు స్వతంత్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వ్యాఖ్యానించారు. -
పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ నిరసన
-
‘చిన్న నోట్లు కావాలని ఆర్బీఐని అడిగాం’
హైదరాబాద్: ప్రణాళిక ప్రకారం పాలన కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. ఉద్యోగులు, ప్రజల నుంచి సహకారం ఆశిస్తున్నట్టు ‘సాక్షి’తో చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తమేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయక తప్పదని అన్నారు. ప్రజల రోజువారి ఇబ్బందులను ఎప్పటికప్పుడు కేంద్రం, ఆర్బీఐ నివేదిస్తున్నామని తెలిపారు. చిన్న నోట్లు కావాలని ఈరోజు కూడా ఆర్బీఐని కోరినట్టు వెల్లడించారు. నోట్లు రాగానే గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తామన్నారు. రోజువారీ కూలీలు, చేతి వృత్తుల వారు డబ్బుల్లేకుండా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ మార్కెట్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రదీప్ చంద్ర హామీయిచ్చారు. -
‘చిన్న నోట్లు కావాలని ఆర్బీఐని అడిగాం’
-
ఏపీలో తీవ్రమైన ఏటీఎం కష్టాలు
-
‘కేసీఆర్ మద్దతు సంతోషకరం’
హైదరాబాద్: పాత పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సాహోసోపేత నిర్ణయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలకడం సంతోషకరని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అనవసరంగా విమర్శలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే తమలాగే బ్యాంకు లావాదేవీలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. మోదీ నిర్ణయానికి కేసీఆర్ మద్దతు పలకడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన నేపథ్యంలో లక్ష్మణ్ ఈవిధంగా స్పందించారు. -
ఏపీలో తీవ్రమైన ఏటీఎం కష్టాలు
విజయవాడ: పాత పెద్ద నోట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్ లో నోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బు లేకపోవడంతో సామాన్యులు అల్లాడుతున్నారు. పాత పెద్ద నోట్లను రద్దు చేసి 22 రోజులు అవుతున్నా 25 శాతం ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్త నోట్లకు అనుగుణంగా 2,575 ఏటీఎంలు మాత్రమే ఆధునీకరించారు. పనిచేస్తున్న ఏటీఎంలలో 2 వేల రూపాయల నోట్లు మాత్రమే లభిస్తున్నాయి. ఏ ఒక్క ఏటీఎంలోనూ 100 రూపాయల నోట్లు లభించని దుస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ. 62 కోట్ల 100 నోట్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో అవి ఏమూలకు సరిపోవడం లేదు. జీతాల రోజు వచ్చినా ఏటీఎంలతో నగదు లభ్యం కాకపోవడంతో సామాన్య జనం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఏపీలో 10 శాతం మాత్రమే ఆన్ లైన్ లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. సరైన సన్నద్ధత లేకుండా నగదు రహిత లావాదేవీలు ఎలా సాధ్యమని జనం ప్రశ్నిస్తున్నారు. రేపటి నుంచి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. -
మా బ్యాంకులో డబ్బులు ఎవడేసుకోమన్నాడు
ఖాతాదారులపై ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు మేనేజర్ ఫైర్ మా డబ్బులు మాకివ్వడానికి మీ నిబంధనలేంటంటూ ఖాతాదారుల మండిపాటు ప్రత్తిపాడు: ‘అసలు మిమ్మల్ని మా బ్యాంకులో డబ్బులెవ్వడేసుకోమన్నాడు.. ఇప్పుడిలా ఎవడెగబడమన్నాడు.. మిమ్మల్ని బతిమాలామా.. మా బ్యాంకుకు రమ్మని పిలిచామా.. ముందు బయటకు పోయి మాట్లాడండి..’ అంటూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఆంధ్రాబ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు ఖాతాదారులపై ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా మాట్లాడి ఖాతాదారుల ఆగ్రహావేశాలకు గురయ్యారు. మంగళవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళితే.. ఈనెల 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవు కాగా, 28న నగదు కొరత వలన విత్‌డ్రాయల్స్‌ను అనుమతించలేదు. దీంతో మంగళవారం ఉదయం ఊహించని విధంగా బ్యాంకు వద్దకు ఖాతాదారులు భారీగా చేరుకున్నారు. దీంతో బ్యాంకులో తోపులాట జరిగింది. తాము ఇంతమంది వచ్చినా బ్యాంకు మేనేజర్ పట్టించుకోకపోవడంతో ఖాతాదారులు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డబ్బుల్లేక జనం అల్లాడుతుంటే.. పట్టంచుకోరా అంటూ నిలదీశారు. తదనంతరం ఖాతాదారులకు మేనేజర్ నగదును అందజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. 16 లక్షలు పంపిణీ చేశాను రెండురోజులు బ్యాంకుకు సెలవు రావడం, సోమవారం బ్యాంకులో నగదు లేకపోవడంతో జనం రద్దీ బాగా ఎక్కువగానే ఉంది. ఇవాళ ఒక్కరోజే సుమారు 600 మందికి రూ.16 లక్షల నగదును అందజేశాం. అసలు మాకు నోట్లు వస్తేనే కదా మేము జనానికి ఇచ్చేది. – శ్రీనివాసరావు, ఆంధ్రాబ్యాంకు మేనేజర్, ప్రత్తిపాడు -
‘మోదీ ఇంటి ముందు ధర్నా చేస్తా’
కోల్ కతా: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోదీని దించుతామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ప్రజల నోట్ల కష్టాలు తొలగించకుంటే ప్రధాని ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. కోల్ కతాతో నిర్వహించిన భారీ ర్యాలీలో మమత పాల్గొన్నారు. ‘దేశం సంక్షోభంలో ఉంది. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేవు. నోట్ల కష్టాలతో 80 మంది మరణించారు. ఇవేమి పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ మొద్ర నిద్ర పోతున్నారు. నగదు రహిత దేశంగా మారాటంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు. గ్రామాల్లో చాలా మందికి బ్యాంకు ఖాతాలు లేవు. ఇలాంటి వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా బతుకుతారు? నోట్ల రద్దుతో దేశంలో అప్రకటిత ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపేది లేదు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలను ఉసిగొల్పుతున్నారు. ఇలాంటి వాటికి నేను భయపడను. మళ్లీ ఢిల్లీ వెళతాను. నా గళం విన్పిస్తాను. అవసరమైతే ప్రధాని మోదీ ఇంటిముందు ధర్నాకు దిగుతాన’ని హెచ్చరించారు. -
‘తెల్ల’ దొరలు.. ఈ తెలుగు తమ్ముళ్లు
-
‘తెల్ల’ దొరలు.. ఈ తెలుగు తమ్ముళ్లు
రూ.కోట్ల నల్లధనం తెల్లధనంగా మార్పిడి కాల్‌మనీ, ఇసుక, లిక్కర్ డబ్బు మార్చేందుకు టార్గెట్లు రైతులు, చిరు వ్యాపారులకు తిప్పలు బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు నల్లధనం మార్పిడికి ఆశ్రయిస్తున్న బడా వ్యాపారులు రూ. 500 కోట్లు నల్లధనాన్ని మార్చిన మంత్రి! సాక్షి, అమరావతి: అమాత్యులు, అధికార పార్టీ ముఖ్య నేతలు తమ అధికార దర్పాన్ని వినియోగించి కూడబెట్టిన నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు అన్ని వర్గాలకు టార్గెట్లు విధిస్తున్నారు. కాల్‌మనీ, ఇసుక, లిక్కర్ వ్యాపారాల్లో అక్రమంగా కూడబెట్టిన సొమ్మును పెద్ద ఎత్తున తెల్లధనంగా మారుస్తున్నారు. నిత్యావసర వ్యాపారాల్లోనూ తమ ‘చిల్లర’ దందా నిర్వహించడంతో రైతులు, చిరు వ్యాపారులకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా ఏపీ రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు, వారి అనుచర గణం పెద్ద నోట్ల మార్పిడి ఓ వ్యాపారంలా సాగిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు తమ చేతికి మట్టి అంటకుండా తమ వద్ద ఉన్న నల్లధనం తెల్లధనంగా మారిపోతూ ఉండటంతో వ్యాపారస్తులు కూడా బ్యాంకు మెట్లు ఎక్కకుండా వీరిద్వారా నోట్లు మార్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ** గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ ముఖ్య నేత కుమారుడు, కుమార్తె బరితెగించి సాగిస్తున్న ’చిల్లర’ దందాకు వ్యాపార వర్గాలు హడలెత్తిపోతున్నాయి. తమ వద్ద ఉన్న రూ.కోట్ల నగదు మార్పిడికి ఆ ముఖ్య నేత కుమార్తె ఏకంగా మందుల షాపులను ఎంపిక చేసుకుని మరీ టార్గెట్లు విధించారు. పెద్ద షాపునకు రూ.5 లక్షలు, చిన్న షాపునకు రూ.2 లక్షలు మార్చాలని హుకుం జారీ చేయడంతో మందుల షాపుల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారుడు పలు వ్యాపార రంగాలకు చెందిన వ్యాపారాలు చేసే వారు ఎన్ని కోట్లు తెచ్చినా మార్చి 20 శాతం తగ్గించి కొత్తనోట్లు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఓ మిల్క్ కంపెనీ వాహనాల్లో చెన్నై తరలించి నోట్ల మార్పిడి చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ** జిల్లాకు చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే ఏకంగా డెయిరీ పార్లర్లలో నగదు మార్పిడి చేస్తున్నారు. పాల రైతుల నుంచి సేకరించిన చిన్న నోట్లను తీసుకుని పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయిస్తున్నారు. ** పల్నాడు ప్రాంతానికి చెందిన మరో సీనియర్ ఎమ్మెల్యే తన ఇంట వివాహానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. మద్యం షాపులు, ఆర్టీసీ డిపోలను నగదు మార్పిడి కేంద్రాలుగా ఎంచుకున్నారు. అంత పెద్ద మొత్తంలో నగదు ఎలా ఖర్చు చేస్తున్నారనేది సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ** ఇదే జిల్లాకు చెందిన ఓ అమాత్యుడు ఏకంగా సహకార సంఘాలను, విత్తన విక్రయ కేంద్రాలను ఎంచుకుని నగదు భారీగా మార్పిడి చేస్తున్నారు. సదరు అమాత్యుడి సతీమణి తమ వల్ల లబ్ధి పొందిన వారందరినీ పిలిపించి నగదు మార్పిడి వ్యవహారాలను అప్పగిస్తున్నారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానించడం గమనార్హం. ** కృష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి, ఆయన అనుచరులు లిక్కర్ సిండికేట్లతో తమకు ఉన్న పరిచయాలను ఉయోగించుకుని పెద్దనోట్లు పెద్ద ఎత్తున 20 శాతం కమీషన్‌కు మార్చుతున్నట్లు తెలిసింది. కోట్లలో నల్లధనం ఉన్న లిక్కర్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీరిని సంప్రదిస్తున్నారు. ** విజయవాడ నగరంలో ఎంతో హుందాగా కనపడే ఒక ప్రజాప్రతినిధి కార్యాలయమే నోట్లు మార్పిడికి కేంద్రంగా మారిందని తెలిసింది. ఆయన అనుచరులు 22 శాతం కమీషన్ తీసుకుని పాత నోట్లు మార్చి కొత్త నోట్లు ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకర్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఈ వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లు తెలిసింది. ** ప్రభుత్వ స్థలాలు, పార్కులు ఆక్రమణ, కాల్‌మనీ, ఇసుక సిండికేట్లతో పాటు ప్రతి వ్యాపారంలోనూ తలదూర్చడంలో దిట్టగా పేరు పొందిన ఒక ప్రజాప్రతినిధి అనుచరులు పాత నోట్లు మార్చడంతో బిజీబిజీగా వున్నారు. ఇసుక సిండికేట్ల వద్ద ఉన్న నల్లధనాన్ని మొత్తం కొత్త నోట్లగా మార్చే బాధ్యతల్ని వీరు భుజానికి ఎత్తుకున్నట్లు తెలిసింది. ** ఒక ప్రజాప్రతినిధి కార్యాలయంలో పనులు చక్కదిద్దే మరో నేత వన్‌టౌన్ లోని ఒక మార్వాడీ వ్యాపారితో ఒప్పందం పెట్టుకుని హవాలా, వడ్డీవ్యాపారస్తుల వద్ద పెద్ద నోట్లు తెల్లనోట్లుగా మార్చే పనిలో బిజీబిజీగా వున్నారు. 500 కోట్లు నల్లధనాన్ని మార్చిన మంత్రి! రాజధాని ప్రాంతంలోని ఓ కీలక మంత్రి, ఆయన ముఖ్య అనుచరులు గత రెండు వారాల్లో రూ.500 కోట్ల మేర పాత నోట్లను మార్చుకున్నారని అత్యంత విశ్వసనీయ సమాచారం. ‘మాది పెద్ద శాఖ. కోట్లలో పనులు జరుగుతుంటాయి. శాఖలోని డబ్బులతో పాటు సంస్థలకు చెప్పి మీ బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు పెద్ద ఎత్తున చేయిస్తాం. రద్దయిన మా పెద్దనోట్లను మార్చి కొత్త నోట్లు ఇవ్వండి...’ అని చెప్పి, రెండు బ్యాంకుల్లో పనిచేసే కీలక అధికారుల సాయంతో ఈ మార్పిడి చేసినట్లు తెలుస్తోంది. ఆ మంత్రికి మద్యం సిండికేట్‌తో అనేక లాలూచీలు ఉన్నాయనే ఆరోపణలు టీడీపీ నేతల నుంచే వినిపిస్తుంటాయి. మంత్రితో పాటు పార్టీ నేతలు ఓ ప్రభుత్వ, ఓ ప్రైవేటు బ్యాంకు అధికారులతో మంతనాలు జరిపి తమ వద్ద పాత నోట్లను మార్చుకున్నట్లు సమాచారం. నోట్లు మార్చుకున్న టీడీపీ నేతలు కూడా తమకు పరిచయం ఉన్న పరిశ్రమలకు చెందిన కరెంటు, సేవింగ్స్ ఎకౌంట్లను మీ బ్యాంకులకు మార్పిస్తామని, వ్యాపారులు కూడా మీ వైపు మళ్లేలా చూస్తామని హామీనివ్వటంతో వారు కూడా అంగీకరించారని తెలిసింది. -
క్యాష్ బ్యాన్: పవర్ కంపెనీలకు బంపర్ బొనాంజ
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల బ్లాక్‌మనీ ఎంతవరకు బయటికి వస్తుందే ఏమో కాని, కొండలా పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు మాత్రం బయటికి వచ్చేస్తున్నాయి. దీంతో సంక్షోభంలో ఉన్న పవర్ కంపెనీలకు బాగానే లబ్ది చేకూరుతుందట. నవంబర్ 24వరకు పెండింగ్‌లో ఉన్న కరెంట్ బిల్లులను పాత నోట్లతో కట్టుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో, ఇన్నిరోజులు బిల్లులను కట్టకుండా ఎగ్గొట్టిన విద్యుత్ వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసుల ముందు బారులు తీరుతున్నారు. పాత నోట్లను రద్దు చేశాక, ఊహించని రీతిలో కరెంట్ బిల్లులు వసూలు అయినట్టు హర్యానా పవర్ రిటైలర్లు పేర్కొంటున్నారు. ఈ నిర్ణయం ప్రకటించిన పది రోజుల్లో 750 మిలియన్ల(7500లక్షల) బిల్లులను వసూలు చేసినట్టు ఆ ప్రావినెన్స్ విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శ అనురాగ్ రోస్తోగి తెలిపారు. గడువు ముగిసే లోపలే చెల్లించాల్సిన బిల్లులను చెల్లించేందుకు వినియోగదారులు తెగ ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. పక్కనే ఉన్న పంజాబ్ రాష్ట్రం కూడా 2,000 లక్షల రూపాయల విద్యుత్ చార్జీలను సేకరించిందని ఆ రాష్ట్ర విద్యుత్ కార్పొరేషన్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.సీ అరోరా తెలిపారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయంతో సంక్షోభంలో ఉన్న పవర్ కంపెనీలు కోలుకుంటున్నాయని, ఇన్నిరోజులు రాని బకాయిలు ఒక్కసారిగా ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసులకు వెల్లువెత్తుతున్నాయని, దీంతో తమ రెవెన్యూలను మెరుగుపరుచుకోవచ్చని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. కావాలని ఎగ్గొట్టిన వారు కూడా తీసుకొచ్చి పాత నోట్లతో బిల్లులు చెల్లిస్తున్నట్టు పవర్ రిటైలర్లు చెబుతున్నారు. నవంబర్ 9 నుంచి రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకులు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసులు, మెడిసిన్ షాపులు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రకటించారు. దీంతో బ్యాంకులు, పెట్రోల్ బంకులు, ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ ఆఫీసుల వద్ద పాత నోట్లను మార్చుకోవడానికి ప్రజలు బారులు తీరుతున్నారు. -
నోట్ల కష్టాలతో 70 మంది మృతి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారు అనాలోచితంగా పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు కష్టాలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. దేశవ్యాప్తంగా నోట్ల కష్టాలతో 13 రోజుల్లో 70 మంది ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జివాలా తెలిపారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడి సామాన్యులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తిరోగమనంలోకి తీసుకెళుతోందా, ముందుకు తీసుకెళుతోందా అని ప్రశ్నించారు. కేంద్రం పలాయనవాదం అవలంభిస్తోందని మండిపడ్డారు. తప్పించుకునే ధోరణి సరికాదని అన్నారు. దేశంలో 86 శాతం నగదు నల్లధనం రూపంలో ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయని, నిజంగా మోదీ ఈ మాట అనుంటే అంతకన్నా అవమానకర ప్రకటన మరోటి ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. చట్టబద్దంగా దాచుకున్న నగదుపై నియంత్రణలు విధించడం సమంజసం కాదన్నారు. నోట్ల కష్టాలతో సామాన్యులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
పాత పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పై కమిటీలు
న్యూఢిల్లీ: పెద్ద కరెన్సీ నోట్ల రద్దుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరును పరిశీలించడం కోసం సీనియర్ అధికారులతో కమిటీలు ఏర్పాటుచేసినట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. అదనపు కార్యదర్శులు/సంయుక్త కార్యదర్శులు/డైరెక్టర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రతి కమిటీలో ఇద్దరు లేదా ముగ్గురు అధికారులుంటారు. తమకు కేటాయించిన రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో కనీసం రెండు రోజులు సందర్శించి కమిటీలు నగదు రద్దు స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తాయి. కరెన్సీ నోట్ల లభ్యత, పెద్ద నోట్ల మార్పిడి, బ్యాంకుల్లో జమ, ఉపసంహరణ, రూ. 2000, 500 నోట్లు వెలువరించేలా ఏటీఎంలలో మార్పులు చేర్పులు తదితరాలకు సంబంధించిని సమస్యలను పరిశీలిస్తాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గృహాలు, వ్యవసాయదారులు, దినసరి కూలీలు, వ్యాపారులు, రవాణా తదితరాలపై చూపుతోన్న ప్రభావాన్ని అంచనావేస్తాయి. ఈ విధానం అమల్లో ఎదురవుతున్న సవాళ్లను తమ నివేదికల్లో పొందుపరుస్తాయని ఆర్థిక శాఖ ప్రకటన జారీ చేసింది. -
నోట్ల రద్దుపై స్పందించిన టాప్ హీరో
తిరువనంతపురం: పాత పెద్ద నోట్లు రద్దు చేస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాన్ని మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ స్వాగతించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని మంచి ఉద్దేశంతో తీసుకున్న మెరుపుదాడిగా ఆయన వర్ణించారు. సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి సలాం చేస్తున్నట్టు తన బ్లాగులో పేర్కొన్నారు. ‘పాత నోట్లను ఉపసంహరించడాన్ని మంచి సంకల్పంతో చేసిన మెరుపుదాడిగా భావిస్తున్నాను. చెప్పినట్టుగానే ప్రధాని మోదీ పనులు చేస్తున్నారు. నేను వ్యక్తులను ఆరాధించను. కానీ నిజాయితీగా తమ ఆలోచనలను అమలు చేసే వారిని ఎక్కువగా అభిమానిస్తాను. రూ. 500, రూ. వెయ్యి నోట్లను రద్దు చేయడం నిజాయితీతో తీసుకున్న నిర్ణయమే. ఆరంభంలో నోట్ల కష్టాలు ఎదురైనా భవిష్యత్ లో మనకు మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. అవివేకంతో ఇటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోరని మనం గుర్తించాలి. మద్యం షాపులు, సినిమా ధియేటర్లు, ప్రార్థనా స్థలాల్లో మనం క్యూలో నిలబడుతుంటాం. మంచి పని కోసం మనం క్యూలో నిలబడడం వల్ల హాని జరగదని నా అభిప్రాయమ’ని మోహన్‌లాల్ పేర్కొన్నారు. షూటింగ్ కోసం ఆయన రాజస్థాన్ వెళ్లారు. కాగా, నోట్ల కష్టాలతో సోమవారం కేరళలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. -
దుమ్మురేపుతున్న ‘లుంగీ క్యూ’ ఫొటో!
పెద్దనోట్ల రద్దుపై సోషల్ మీడియాలో ఇప్పటికే ఎన్నో జోకులు హల్చల్ చేస్తున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు ఈ విషయం మీద సెటైర్ల మీద సెటైర్లు గుప్పిస్తున్నారు. ప్రజల కష్టాలు దృష్టిలో పెట్టుకొని మరికొందరు కేంద్రాన్ని తప్పుబడుతున్నారు. కానీ వీటన్నింటి కన్నా ఇటీవల ఆన్‌లైన్‌లోకి అడుగుపెట్టిన ఓ ‘లుంగీ క్యూ’ ఫొటో మాత్రం ‘లుంగీ డ్యాన్స్’ను మించి హల్చల్ చేస్తోంది. ఈ ఫొటోలో లుంగీలు కట్టుకున్న జనాలు రెండు క్యూలలో నిలిచి ఉండటం చూశారు కదా..! ఇందులోని ఒక క్యూ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడానికి కాగా, మరొక క్యూ మందుబాబులది. దీంతో ‘ప్రధానిగారు కేరళ నుంచి మీకో విజ్ఞప్తి: మద్యం షాపుల్లో పాత నోట్లనైనా తీసుకోమనండి లేదా బ్యాంకుల్లో మద్యాన్నైనా అమ్మండి. అంతేకానీ మేం రోజూ ఇలా రెండు క్యూలలో నిలుచోలేం’ అంటూ ఈ ఫొటోను నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. ఫొటోలో మద్యం దుకాణం బోర్డు మీద మలయాళంలో ‘విదేశమద్యం’ అని రాసి ఉండటం చూడొచ్చు. ఇంకా విచిత్రమేమిటంటే ఏటీఎం ముందు కన్నా మందుబాబుల క్యూ పెద్దగా ఉండటం. నిజానికి ఈ ఫొటో కేరళ దినపత్రికల్లో వచ్చినదే. కానీ, కోజికోడ్ కలెక్టర్ ప్రశాంత్ నాయర్ ఓ ఆసక్తికరమైన కామెంట్‌తో ఈ ఫొటోను ఫేస్బుక్లో షేర్ చేయడంతో ఇది వైరల్ అయింది. ఈ ఫొటోలో ఏటీఎంల ముందు నిలబడిన జనాలు మర్యాదగా లుంగీలు దించి నిలబడగా.. మరో క్యూలో మందుబాబులు లుంగీలు ఎత్తికట్టుకున్నారంటూ గుర్తించి ఆయన కామెంట్ పెట్టడం బాగా పేలింది. దేవాలయాలు, పవిత్ర ప్రదేశాలకు వెళ్లినప్పుడు లుంగీలు దించి మర్యాదగా కనిపించే సంప్రదాయం తెలిసిందే. అదే ఇతర చోట్లకు వెళితే లుంగీలు ఎత్తికట్టుకోవడం రివాజు. అదే ఈ ఫొటోలో కనిపిస్తోందన్నది నెటిజన్లు ఉవాచ. మొత్తానికి మద్యానికి ఉన్న డిమాండ్‌తోపాటు అది డిమానిటైజేషన్‌తో ఎలా పోటీ పడుతున్నదో చాటే ఈ ఫొటో ఫన్నీ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. -
రాజన్న హుండీలో పాతనోట్ల కట్టలు
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేయడంతో దేవుళ్ల హుండీకీ డిమాండ్ పెరిగింది. చాలామంది భక్తులు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు. దీంతో అన్నీ ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి. తాజాగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు లక్షల్లో పాత నోట్లను వేశారు. ఓ వ్యక్తి రూ.500, రూ. వెయ్యి నోట్లతో రూ.4.50 లక్షలు, మరో అజ్ఞాత వ్యక్తి పాత రూ.వెయ్యి నోట్లతో లక్ష రూపాయలను హుండీలో వేయడం సంచలనం కలిగించింది. -
ఆ ఆలయం హుండీ నిండా.. పెద్దనోట్ల కట్టలు!
సాక్షి, ముంబై: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేవుళ్ల హుండీకీ డిమాండ్ పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. చాలామంది భక్తులు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు. దీంతో అన్నీ ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి. తాజాగా షిర్డీ సాయిబాబా ఆలయానికీ పాతనోట్ల రూపంలో కానుకలు వెల్లువెత్తాయి. గత మూడు రోజుల్లో షిరిడీ హూండీలలో భక్తులు రూ. 1.50 కోట్ల కానుకలుగా సాయిబాబాకు సమర్పించగా, వీటిలో ఏకంగా రూ. 1.07 కోట్లు రద్దైన రూ. 500, 1000 నోట్లే కావడం విశేషం. షిర్డీ సాయిసంస్థాన్ పెద్ద నోట్లను స్వీకరించడం లేదని ప్రకటించినప్పటికీ అనేకమంది భక్తులు పాత నోట్లనే హుండీలో వేస్తున్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని పాత నోట్లు హుండీలలో దర్శనమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇలా జరగకుండా ఉండేందుకు మరాఠ్వాడాలోని అనేక మందిరాల్లో ఉన్న హుండీలను సీల్ చేసేశారు. మరోవైపు ఆలయ హుండీలలో సమర్పించే కానుకలకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఎంత నల్లధనం గుట్టురట్టు కానుందో తెలుసా?
-
ఎంత నల్లధనం గుట్టురట్టు కానుందో తెలుసా?
అవినీతి, పన్ను ఎగవేతపై ఉక్కుపాదం మోపడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఖజానాకు అక్షరాల రూ. మూడు లక్షల కోట్ల (45 బిలియన్ డాలర్ల) లాభం చేకూరనుందని విదేశీ మీడియా విశ్లేషించింది. దేశ బడ్జెట్‌కు చేరనున్న ఈ అదనపు మొత్తం ఏకంగా ఐస్లాండ్ దేశ ఆర్థిక వ్యవస్థతో సమానమని పేర్కొంది. రూ. 500, వెయ్యినోట్ల రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల ఏకంగా రూ. మూడు లక్షల కోట్ల (45బిలియన్ డాలర్ల) నల్లధనం వెలికిరానుందని, పన్నును తప్పించుకునేందుకు ఈ మొత్తాన్ని కరెన్సీని విదేశాల్లో దాచిపెట్టారని ముంబైకి చెందిన బ్రోకరేజి సంస్థ ఎడెల్వీస్ సెక్యూరిటీ లిమిటెడ్ విశ్లేషించింది. ఇక ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్షిప్ లిమిటెడ్ మరింత ఆశాజనకమైన అంచనా వేసింది. ఏకంగా 4.6 లక్షల కోట్ల నల్లధనం బయటకు రావొచ్చునని అంచనా వేసింది. ఆర్థికవేత్తలు పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రభావాలు ఏమిటన్న దానిపై లోతుగా విశ్లేషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో 17.8 లక్షల కోట్ల నగదు కరెన్సీరూపంలో చలామణిలో ఉంది. పెద్దనోట్ల రద్దుతో ఏకంగా ఇందులో 86శాతం నగదు తుడిచిపెట్టుకుపోనుంది. ఇలా తుడిచిపెట్టుకుపోతున్న కరెన్సీలో మూడోవంతు నల్లధనం లేదా, ప్రకటించని నగదు ఉండే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నల్లధనం వెలుగులోకి వస్తే.. ఆసియాలో అత్యంత ఎక్కువ ద్రవ్యలోటు కలిగిన భారత్.. ఆ లోటును భర్తీచేసుకొని మెరుగైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశముందని భావిస్తున్నారు. వెలుగులోకి వచ్చిన ఈ నల్లధనాన్ని దేశంలో పలు ఆర్థిక సంస్కరణలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చునని, అంతేకాకుండా ఆర్బీఐ తన అప్పులను తీర్చుకొని.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు కూడా సమకూర్చవచ్చునని ఎడెల్వీస్ విశ్లేషకుడు మనోజ్ బహెతీ తెలిపారు.