ప్రణాళిక ప్రకారం పాలన కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. ఉద్యోగులు, ప్రజల నుంచి సహకారం ఆశిస్తున్నట్టు ‘సాక్షి’తో చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తమేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయక తప్పదని అన్నారు. ప్రజల రోజువారి ఇబ్బందులను ఎప్పటికప్పుడు కేంద్రం, ఆర్బీఐ నివేదిస్తున్నామని తెలిపారు.