
రాష్ట్ర బీజేపీ కొత్త కమిటీ ప్రకటన
• 10 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు,
• 10 మంది కార్యదర్శులతో రాష్ట్ర కమిటీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కమిటీ, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ కమిటీలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు. కొంత కాలంగా రాష్ట్ర కమిటీ నియామకంపై పార్టీలో ఎదురుచూపులు సాగుతుండగా, ఎట్టకేలకు బుధవారం ప్రకటిం చారు. మొత్తం 10 మంది ఉపాధ్య క్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శు లు, 10 మంది కార్యదర్శులు, ఒక కోశాధికారితో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎం.ధర్మారావు, ఎస్.మల్లారెడ్డి, వెంకటరమణి, వనిత, సంకినేని వెంకటేశ్వర రావులను (పాతకమిటీ లోని వారు) కొనసాగిస్తూ సీనియర్‌నేత టి.రాజేశ్వరరావుతోపాటు గత కమిటీలో కార్యదర్శులుగా ఉన్న వై. గీత, కాసం వెంకటే శ్వర్ యాదవ్, పి.మోహన్‌రెడ్డిలకు ప్రమోషన్ ఇచ్చారు.
ప్రధాన కార్యదర్శులుగా చింతా సాంబ మూర్తి, జి.ప్రేమేందర్‌రెడ్డి, టి.ఆచారి లను కొనసాగిస్తూ కొత్తగా జి.మనోహర్‌రెడ్డికి అవకాశం కల్పించారు. కార్యదర్శులుగా ఎస్. కుమార్‌ను కొనసాగిస్తూ కొత్తగా బి. జనార్దన్‌రెడ్డి, ప్రేమ్‌రాజ్ యాదవ్, పాపా రావు, ఎస్.శ్రీధర్‌రెడ్డి, షేరి నరసింగరావు, జాజుల గౌరి, ఛాయదేవి, శ్రీధర్‌రెడ్డి, నిర్మలా గోనెలను నియమించారు. గతంలో కార్యదర్శిగా పనిచేసిన శాంతికుమార్‌కు కోశాధికారిగా అవకాశం కల్పించారు.
వివిధ రంగాల కమిటీలు...
ప్రభుత్వ సమన్వయం-ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, అమిత్ అగర్వాల్, పొలిటికల్ ఫీడ్ బ్యాక్ కమిటీ-మాజీ డీజీపీ వి.దినేష్‌రెడ్డి, లైబ్రరీ అండ్ డాక్యుమెంట్స్-సుమంత్, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్- బి.వెంకటరెడ్డి, లా అఫైర్స్(గతంలో లీగల్ సెల్)- రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, పార్టీ జనరల్స్-ప్రొఫెసర్ జగదీశ్వరరావు, పాత కమిటీలకు సంబంధించి పాలసీ రిసెర్చి, థింక్ ట్యాంక్-జీఆర్ కరుణాకర్, మీడియా సెల్, మేనేజ్‌మెంట్ కమిటీని మీడియా కమిటీ-సుధాకర శర్మ, మీడియా రిలేషన్‌స డిపార్ట్‌మెంట్‌గా (అరుుదుగురితో ఏర్పాటు) విడదీశారు. ట్రైనింగ్- ఓఎస్ రెడ్డి, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ-ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఐటీసెల్‌ను కోఆర్డినేషన్ ఆఫ్ ఐటీ, వెబ్‌సైట్, సోషల్ మీడియా కమిటీగా మార్చి ఇన్‌చార్జిలుగా మణికిషోర్‌రెడ్డి, వెంకటరమణలను నియమించారు. ఎన్‌ఆర్‌ఐ-టి.ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ పి.దేవయ్య, అజీవన్ సహయోగ్- మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి, గోవర్థన్‌లను ఇన్‌చార్జీలుగా నియమించారు.
జాతీయ నాయకత్వం సూచనతో..
జాతీయ నాయకత్వం సూచనల మేరకు గతంలోని కొన్ని కమిటీలతో పాటు కొత్తగా ప్రోగ్రామ్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్‌గా డి.ప్రదీప్‌కుమార్, బేటీ బచావో- బేటీ పడావో కమిటీ చైర్‌పర్సన్‌గా విజయలక్ష్మి, తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్‌గా శ్రీవర్ధన్‌రెడ్డిలను నియమించారు. అలాగే స్వచ్ఛభారత్-నాగూరావు నామాజీ, క్రమశిక్షణ కమిటీ-జి.శ్యాంసుందర్‌రావు, ఫైనాన్‌స కమిటీ-మోరేపల్లి సత్యనారాయణ, తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌గౌడ్‌ను నియమించారు.
కిసాన్ మోర్చా మినహా అంతా కొత్త వారే
రాష్ట్ర పార్టీకి చెందిన మొత్తం పది మోర్చాలకు గాను కిసాన్‌మోర్చా అధ్య క్షుడిగా గోలి మధుసూదన్‌రెడ్డికి మాత్రమే మరోసారి అవకాశం కల్పించారు. బీజే వైఎం- భరత్ గౌడ్, ఎస్సీ మోర్చా- అశోక్, ఎస్టీ మోర్చా-భిక్కూ నాయక్, మజ్దూర్‌సెల్ -ఎస్.చంద్రశేఖర్ యాదవ్, మహిళా మో ర్చా-ఆకుల విజయ, బీసీ మోర్చా-కాటం నరసింహ యాదవ్, మైనారిటీ మోర్చా- అఫ్సర్ పాషా, లింగ్విస్టిక్ మైనారిటీ కమిటీ-భవర్‌లాల్ వర్మ, ప్రోటోకాల్-రవి మెహ్రాలకు అవకాశం కల్పించారు.
పదిమంది అధికార ప్రతినిధులు..
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా కృష్ణసాగర్ రావు, రఘునందన్‌రావు, పుష్పలీల, అల్జాపూర్ శ్రీనివాస్‌లను కొనసాగిస్తూ కొత్తగా ఎస్.ప్రకాశ్‌రెడ్డి కె.రాములు, బండి సంజయ్, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవడు ఎన్‌వీ సుభాష్, నరేష్, మాధవి చౌదరిలను నియమించారు.