‘హైదరాబాద్‌’పైనే మా గురి: లక్ష్మణ్‌ | bjp laxmman target to hyderabad | Sakshi
Sakshi News home page

‘హైదరాబాద్‌’పైనే మా గురి: లక్ష్మణ్‌

Published Tue, Apr 4 2017 2:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

‘హైదరాబాద్‌’పైనే  మా గురి: లక్ష్మణ్‌ - Sakshi

‘హైదరాబాద్‌’పైనే మా గురి: లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: మోదీ ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి మంత్రం వల్ల అస్సాం, యూపీ, మణిపూర్‌ వంటి ముస్లిం, క్రైస్తవ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో కూడా బీజేపీ అఖండ విజయాన్ని సాధించిం దన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లోక్‌సభ సీటును సైతం గెలుచుకునే విధంగా బీజేపీ వ్యూహాన్ని రూపొంది స్తోందన్నారు.

ఇందుకు 7న జరగనున్న హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ కార్య కర్తల సమన్వయ సదస్సుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు దీటుగా, నిజమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.   6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పోలింగ్‌ బూత్‌ స్థాయిల్లో బీజేపీ జెండాలను ఎగురవేసేలా కార్యక్రమాలను రూపొందించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement