
ఉధృతంగా ఉద్యమించండి: లక్ష్మణ్
ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా జిల్లాల వారీగా ఉధృతంగా పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా జిల్లాల వారీగా ఉధృతంగా పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉడీ ఘటనలో కంటే నోట్ల రద్దుతో చనిపోరుున వారే ఎక్కువంటూ సైనికుల త్యాగాలను కించపర్చేలా మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని, అప్పటి వరకు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. బీజేవైఎం దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా వేముల అశోక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న దళిత, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేసి ఆ వర్గాలకు చేరువ కావాలని కోరారు. ‘‘రాష్ట్రం ఏర్పడితే దళితుడే సీఎం అవుతారన్న టీఆర్‌ఎస్ హామీ మొదలు దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ఫీజు బకారుులవల్ల ఉన్నత చదువుకు నోచుకోకుండా ఉన్న దళిత విద్యార్థులు, బస్తీల్లో పడుతున్న పాట్లు వంటి అంశాలపై బీజేవైఎం క్షేత్రస్థారుులో పోరాటాలను ఉధృతం చేయాలి’’ అని కోరారు.