సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ కె.లక్ష్మణ్‌ను మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు రాష్ట్ర కార్యాలయంలో సోమవారం సన్మానించారు. లక్ష్మణ్ నేతృత్వంలో రాష్ట్రంలో పార్టీ బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.
శేషగిరిరావుపై కోతుల దాడి: బీజేపీ సీనియర్ నాయకులు ప్రొఫెసర్ ఎస్.వి.శేషగిరిరావుపై కోతులు దాడి చేశాయి. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఇటీవల కోతులు దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నగరంలో కోతుల బెడదను అరికట్టాలని గతంలో చాలాసార్లు లేఖలు రాసినా చలనం లేదని, రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని బీజేపీ నేతలు విమర్శించారు.