'ఇదేనా కేసీఆర్ మార్క్ పరిపాలన'
హైదరాబాద్: కేసీఆర్ తెలంగాణ సీఎంగా మాటలు కోటలు దాటాయి తప్ప... చేతలు కాదని బీజేపీ తెలంగాణ శాసనసభ పక్ష నేత డా.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి 100 రోజులైన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.... కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు.
కేసీఆర్కు పరిపాలన దక్షత లేదని... ఆయన ఇంకా ఉద్యమపార్టీలా ఆలోచిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రోజురోజూకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం అజెండానే కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పరిపాలనలో అన్నీ వివాదాస్పద నిర్ణయాలే అని అన్నారు. ఇదేనా కేసీఆర్ మార్క్ పరిపాలన అని డా. కె.లక్ష్మణ్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.