
విపక్షాల విమర్శలు తిప్పికొట్టే వ్యూహం
పెద్ద నోట్ల రద్దుపై బీజేపీ అవగాహనా కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాల ద్వారా తిప్పి కొట్టాలని బీజేపీ నిర్ణరుుంచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చర్చాగోష్టుల ద్వారా ఆయా అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల తాత్కాలికం గా కొంత ఇబ్బంది కలిగినా దేశానికి, ప్రజల కు కలగనున్న దీర్ఘకాలిక ప్రయోజనాలను వివరించేందుకు వివిధ రూపాల్లో కార్యక్ర మాలను రూపొందిస్తోంది. పెద్దనోట్ల రద్దు తో నల్లధనం బయటకు వస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు మరింతగా అందడంతో పాటు, ఈ డబ్బు దేశాభివృద్ధికి, ఆర్థికాభి వృద్ధికి దోహదపడుతుందనే విషయాన్ని వివి ధవర్గాల ప్రజలకు సులభంగా అర్థమయ్యే లా చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచింది.
ఈ సమావేశాలపై పార్టీ ముద్ర పడకుండా వివిధ రంగాల ప్రముఖులు ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు, సందేహాలను దూరం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఇటీ వల హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, పాట్నా పూర్వ చీఫ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, మాజీ డీజీపీ అరవిందరావు, బ్యాంకింగ్, ఆర్థిక రంగ ప్రముఖులతో చర్చాగోష్టి ద్వారా ఈ కార్యక్రమాలను మొదలుపెట్టింది. కరీం నగర్‌లో న్యాయవాదులు, ఆర్థికవేత్తల ఆధ్వర్యంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించి ఆయా అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. వీలైనంత త్వరలో ఇదే విధంగా అన్ని జిల్లాల్లోనూ గోష్టులు, సదస్సులు నిర్వహించాలని నిర్ణరుుంచింది. దీంతో పాటు... కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పార్టీ నాయకులు, కేడర్‌కు కూడా సూచనలు, సలహాలతో స్పష్టతనిస్తున్నారు.
అవగాహనకు చర్యలు
పెద్ద నోట్ల రద్దుపై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీపరంగా ప్రచార కార్య క్రమాలు నిర్వహిస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా లేదనే విషయాన్ని తాజా ఉపఎన్నికల ఫలితాలు స్పష్టం చేశారుు. అస్సాం, ఎంపీలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. నల్లధనం రాజకీయా లను శాసిస్తోంది. అవినీతి వ్యవస్థీకృతమైంది. వీటి ప్రక్షాళన జరగాల్సి ఉంది. నగరంలో కోటి మందికి పైగా జనాభా ఉంటే అందులో కనీసం ఒక్కశాతం కూడా బ్యాంకులు, ఏటీఎంల ముందు కనిపించడం లేదు. - కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు