సుప్రీం తీర్పుతో ముస్లిం మహిళలకు ఊరట | Muslim women with supreme judgments | Sakshi
Sakshi News home page

సుప్రీం తీర్పుతో ముస్లిం మహిళలకు ఊరట

Published Thu, Aug 24 2017 3:50 AM | Last Updated on Sun, Sep 2 2018 5:50 PM

సుప్రీం తీర్పుతో ముస్లిం మహిళలకు ఊరట - Sakshi

సుప్రీం తీర్పుతో ముస్లిం మహిళలకు ఊరట

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: ట్రిపుల్‌ తలాక్‌ను ఆరునెలల పాటు నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ముస్లిం మహిళలకు పెద్ద ఊరట కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. తలాక్‌పై తీర్పు నేపథ్యంలో పలువురు ముస్లిం మహిళలు బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ముస్లిం దేశాల్లో కూడా ట్రిపుల్‌ తలాక్‌ అమలులో లేదన్నారు. భారతదేశంలో తలాక్‌ను నిషేధించడాన్ని మతపరంగా చూడొద్దని, ఒక సామాజిక రుగ్మతగానే చూడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement