‘తలాక్‌’ తీర్పును స్వాగతిస్తున్నాం | Laxman on Triple Thalak | Sakshi
Sakshi News home page

‘తలాక్‌’ తీర్పును స్వాగతిస్తున్నాం

Published Wed, Aug 23 2017 1:54 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

‘తలాక్‌’ తీర్పును స్వాగతిస్తున్నాం - Sakshi

‘తలాక్‌’ తీర్పును స్వాగతిస్తున్నాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌:
ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ముస్లిం మహిళలకు పెద్ద ఊరటని, ఈ తీర్పు ను స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ, సుప్రీం తీర్పు ఎవరి విజ యమో, ఎవరి అపజయమో కాదన్నారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం, స్వావలం బనకు ఈ తీర్పు దోహదం చేస్తుందన్నారు.

అనేక ఏళ్ల నుండి దీనికోసం పోరాటం జరుగుతున్నదన్నారు. ఇప్పటికైనా ముస్లిం మత సంస్థలు, పార్టీలు పేద ముస్లిం మహిళలకు అండగా నిలబడాలన్నారు. టాస్క్‌ఫోర్సు కార్యాలయం మానవ బాంబు దాడి విషయంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాటలు బాధ్యతారాహిత్యమన్నారు. టాస్క్‌ఫోర్సు కేసులో ఒకలాగా, మాలెగావ్‌ దాడుల మీద మరోలాగా మాట్లాడటం ఒవైసీ ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement