సాక్షి, హైదరాబాద్: నేర విచారణ చట్టం (సీఆర్‌పీసీ) సెక్షన్ 41–ఎను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి క్రిమినల్ కోర్టుల న్యాయవాదుల సంఘం సహాయ కార్యదర్శి జక్కుల లక్ష్మణ్ రాసిన లేఖపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని జాతీయ న్యాయసేవా సాధికార సంస్థ (నల్సా)ను ఆదేశించారు.
స్పందించిన నల్సా..లక్ష్మణ్ లేఖపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర న్యాయసేవా సాధికార సంస్థను సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పి.నవీన్‌రావు నేతృత్వంలోని సంస్థ త్వరలోనే సమావేశమై తగిన నిర్ణయం తీసుకోనుంది. ‘కొన్నేళ్లుగా నేను కేంద్ర ప్రభుత్వంతోపాటు పలుమార్లు సుప్రీంకోర్టుకు లేఖ రాసినా స్పందన లేదు.
41–ఎను అడ్డుపెట్టుకొని పోలీసులు నిందితులను వేధిస్తున్నారు. లంచం ఇస్తే స్టేషన్‌లోనే బెయిల్ ఇస్తున్నారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాలను జతచేస్తూ గత ఆగస్టు 26న సీజేఐకి రాసిన లేఖకు ఇంత త్వరగా స్పందన వస్తుందని అనుకోలేదు. సీజేఐకి కృతజ్ఞతలు’అని లక్ష్మణ్ మీడియాతో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment