‘ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యం’ | k.laxman fires on state governament | Sakshi
Sakshi News home page

‘ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యం’

Published Tue, Apr 12 2016 3:25 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM

‘ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యం’ - Sakshi

‘ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యం’

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీలపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను సోమవారం ఇక్కడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటైతే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు దక్కుతాయని పోరాడితే, సీఎం కేసీఆర్ తీరు ఆందోళనకరంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి అరకొర నిధులు కేటాయించడమేకాకుండా వాటిని కూడా ఖర్చు చేయడంలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని లక్ష్మణ్ విమర్శించారు. రాష్ట్రంలో 17 ఫెడరేషన్లను 11కు కుదించారని, వాటికి కూడా అతితక్కువ బడ్జెట్‌ను కేటాయించారని ఆరోపించారు. కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement