
జైరాం రమేశ్‌వి దివాలాకోరు విమర్శలు
డాక్టర్ కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎం.వెంక య్యనాయుడుపై కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ వ్యాఖ్య లు దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు.
పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెంకయ్యపై నిరాధార ఆరో పణలు చేయడం బాధాకరమని అన్నారు. వెంకయ్య జీవితం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడం పరిపాటేనని తెలి పారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకు పోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటువంటి మాటలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.