‘మల్లన్న సాగర్’ బాధితులకు అండగా ఉంటాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్
శామీర్‌పేట్: మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూములు కొల్పోతున్న బాధితులకు తమ పార్టీ అండ గా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. సిద్దిపేట, దుబ్బాక ప్రాం తంలో నూతనంగా నిర్మించనున్న వుల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వల్ల భూవుులు కోల్పోతున్న బాధితులను పరావుర్శించేందుకు బుధవారం ఆయ న మెదక్ జిల్లా సిద్దిపేటకు వెళ్లారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కు అలియూబాద్ చౌరాస్తా వద్ద ఆ పార్టీ నాయకుడు విష్ణువర్దన్‌రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడారు. భూవుులు కోల్పోతున్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉం డాలన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో సువూరు 17 గ్రావూల ప్రజలకు అన్నిరకాల హోదాలు కోల్పోయే ప్రవూదం ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భూనిర్వాసితులపై రెచ్చగొట్టే వాఖ్యలు చేసి వుధ్యతరగతి ప్రజలవుధ్య చిచ్చుపెట్టే చర్యలు వూనుకోవాలని హితవు పలికారు. కేవ లం నాలుగు గ్రావూల కోసం 40వేల గ్రావూల ప్రజలను ఇబ్బందులకు గురిచేయూలా అనే ధోరణిలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వుధ్యతరగతి ప్రజలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయున్నారు. దీనిని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నిపుణులను నియుమించి బాధితులకు అన్నిరకాల సౌకర్యా లు కల్పించేలా కృషిచేయూలన్నారు.
వుుఖ్యం గా భూవుులు, ఇతర వృత్తి, వ్యాపారులు కోల్పోతున్న నిరాశ్రయుులకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇవ్వడానికి ఈ యూత్ర చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రవుంలో బీజేపీ రాష్ట్రకార్యదర్శి కొంపల్లి మోహన్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, మేడ్చల్ బీజేపీ అధ్యక్షుడు జగన్‌గౌడ్, శామీర్‌పేట్ అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ హృదయ్‌కువూర్, నాయుకులు ఈశ్వర్‌గౌడ్, శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌నాయుక్, కొరివి కృష్ణ, భాషా, జి.వూధవరెడ్డి, బి.నాగరాజుచారి, బి.లక్ష్మణ్, నరేందర్‌గౌడ్, బాబుగౌడ్ పాల్గొన్నారు.