కరువు సహాయక చర్యల్లో టీఆర్‌ఎస్ సర్కారు మీనమేషాలు
ఓట్లు, సీట్లు, నోట్లు తప్ప ప్రజలగోడు పట్టదా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్
కరువు జిల్లాగా ప్రకటించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
ముకరంపుర : ‘టీఆర్‌ఎస్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఓట్లు, సీట్లు, నోట్ల రాజకీయాలే తప్ప ప్రజాసంక్షేమా న్ని పట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా.. సహాయక చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కరువుపై చర్చిస్తే పరువుపోతుందని భావిస్తున్న రాష్ట్ర సర్కారుపై తిరుగుబాటుకు ఈ ధర్నా కనువిప్పు కావాలి. కరువుపీడిత ప్రాంతాలకు న్యాయం జరిగే వరకూ... ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకూ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడుతూనే ఉంటాం.. రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటాం..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు.
జిల్లాను కరువుప్రాంతంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువుతో చేతివృత్తులు, పేద, బడుగుబలహీనవర్గాల ప్రజలు 40 లక్షల మంది ఇప్పటికే పల్లెలను వదిలి వలసబాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఎద్దేవా చేశారు. అనేక వాగ్దానాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్‌ఎస్.. హామీలన్నింటినీ నీటిమూటలు చేసిందన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన శ్రీకాంతాచారి నుం చి ఆదిరెడ్డి వరకు ఆత్మబలిదానాలనూ ప్రభుత్వం విస్మరించిందన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీతోపాటు కేజీటూపీజీ ఉచిత విద్యను అమలు చేస్తామన్న సీఎం ఆ ఊసే మరిచారన్నా రు. రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయనకున్న వారి ఆశలకు భంగపాటే ఎదురవుతోందన్నారు. రెండేళ్ల పాలనలో ఆ పార్టీ బలోపేతం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
కరువుపై దృష్టి మళ్లించేందుకే..
కరువుపై చర్చలేకుండా.. ప్రజల దృష్టిని మరల్చడానికే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ఎత్తుకున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా కనీసం తాగునీరు కూడా అందించలేకపోవడం కేసీఆర్ పాలనకు అద్దంపడుతోందన్నారు. రెండేళ్లలో టీఆర్‌ఎస్ సర్కారు లక్షల కోట్ల అప్పు చేయడం తప్ప సాధించిందే మీ లేదన్నారు. తుదిదశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ దోపిడీ చేసేందు కు కొత్తగా ప్రాజెక్టుల రీడైజైన్లు అంటూ ముందుకుపోవడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు అందించిన సహాయంపై శ్వేత ప త్రం విడుదల చేయాలన్నారు. కరువు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు, వాణి జ్య పంటలకు రూ.20 వేల పరిహారమందిస్తూ పన్నులు, ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారింగా నిర్వహించకపోతే పలెపల్లెనా జాతీయ జెండాలు ఎగిరే సి ఘనంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో రాష్ట్ర కార్యదర్శులు చింత సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, కాశిపేట లింగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాాలు పద్మజారెడ్డి, నాయకులు బల్మూరి వనిత, ఆకుల విజయ, జిల్లా కార్యదర్శులు కన్నం అంజయ్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, ఆది శ్రీనివాస్, నారాయణరావు, ఆది కేశవరావు, కోమల ఆంజనేయులు, జగన్మోహన్‌రావు, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, హన్మంత్‌గౌడ్, లింగంపల్లి శంకర్ తదితరులున్నారు.
లక్ష్మణ్‌కు ఘనంగా స్వాగతం
బీజేపీ రాష్ట్ర సారథిగా జిల్లాకు తొలిసారిగా వచ్చిన లక్ష్మణ్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారుు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్, రామగుండం బీజేపీ నాయకుడు కౌశిక్ హరి ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వేదికపైకి బండి సంజయ్‌ను ఆహ్వానించగానే కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. కౌశిక్ హరి లక్ష్మణ్‌కు కండువా కప్పారు. బైక్‌ర్యాలీలో బాస సత్యనారాయణ, బేతి మహేందర్‌రెడ్డి, కౌశిక్‌హరి, గడ్డం నాగరాజు, కోమల మహేశ్, లక్ష్మణ్, లక్ష్మినర్సయ్య ఉన్నారు. వేదికపై బీజేపీ సాంస్కృతిక విభాగం కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
నీడలా వెంటాడుతాం..
Published Tue, May 17 2016 10:40 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM
Advertisement