Drought district
-
రైతు శ్రమను గుంజుకుంటారా..?
► బలవంతపు భూ సేకరణ వ్యతిరేకిస్తున్నాం ► టీడీపీ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తోంది ► ఉద్యోగాలంటూ ఊరించడమే.. అమలు చేసింది లేదు ► సీపీఎం నేత పి.మధు ధ్వజం ► దొనకొండలో పార్టీ శ్రేణుల ర్యాలీ ► ప్రకాశంను కరువు జిల్లాల జాబితాలో చేర్చాలరి డిమాండ్ దొనకొండ : రైతులు తమ రక్తం ధారపోసి, నిరుపయోగంగా ఉన్న కొండలు, గుట్టలను చదును చేసుకున్నారు. సేద్యానికి అనువుగా మార్చుకుని అందులో సాగుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పుడు ఆ భూములను భూసేకరణ పేరుతో బలవంతంగా లాక్కుంటారా..? అని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ మాజీ సభ్యుడు పి.మధు ప్రశ్నించారు. బలవంతపు భూ సేకరణకు తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాను కరువు జిల్లాల జాబితాలో చేర్చాలని, దొనకొండ మండలాన్ని అభివృద్ధి చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల కార్యదర్శి చిరుపల్లి అంజయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మధు మాట్లాడుతూ నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లాలో ప్రజలు జీవనం సాగించడం రాబోయే రోజుల్లో చాలా కష్టంగా ఉంటుందన్నారు. పట్టా భూములతో సమంగా పరిహారమివ్వాలి.. రైతు సమస్యలు తెలుసుకునేందుకే కమ్యూనిస్టు పార్టీ పాదయాత్ర ఏర్పాటు చేసిందని మధు చెప్పారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో పంటలు ఎండు ముఖం పట్టాయని, భూగర్భ జలాలు సైతం అడుగంటిపోవడంతో రైతులు పెట్టుబడులైనా వస్తాయో రావోననే ఆందోళనతో ఉన్నారన్నారు. గ్రామాల్లో ఉపాధి పనులు లేక చాలా మంది వలస బాట పట్టారని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా అభివృద్ధిని అరచేతిలో స్వర్గం చూపిస్తుందన్నారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని అనేక దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు వస్తున్నారని, వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని ఊరించడమే తప్ప అమలు చేసిందేమి లేదన్నారు. 2103 భూసేకరణ చట్టం ప్రకారం సెటిల్మెంట్ పట్టా భూములతో సమానంగా అసైన్డ, ప్రభుత్వ భూముల సాగుదారులకు పరిహారం ఇవ్వాలని, ఆ భూముల్లో పనులు కోల్పోతున్న కూలీలకు పింఛన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల కోరిక వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటారుుంచి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దొనకొండ నుంచి బయలుదేరిన పాదయాత్ర ఆరు నియోజక వర్గాలు, 15 మండలాలు, 102 గ్రామాలలో 350 కిమీ 15 రోజుల్లో పర్యటించి డిసెంబర్ 23వ తేదీకి ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుంటామన్నారు. పార్టీ రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య మాట్లాడుతూ గ్రామాలలో ఉపాధి పనుల్లేక ప్రజలు అప్పుల్లో కూరుకుపోయారని, జిల్లాలో 65 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఏడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రభుత్వం గుర్తించిన సమయంలో అందులో మన జిల్లాను చేర్చాలని పట్టుబట్టిన ప్రజాప్రతినిధి జిల్లాలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. నిత్యం కరువు, వలసలు, అనావృష్టి, పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలు దారిద్య్రంలో జీవిస్తున్నారన్నారు. సీపీఎం పాదయాత్ర ప్రజలను జాగృతం చేసేందుకు నిర్వహిస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్టు అధ్యాపకులు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మధుకు అందజేశారు. అనంతరం పాదయాత్రను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కంకణాల ఆంజనేయులు, వెంకటరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి సోమయ్య, రమేష్, స్థానిక నాయకులు తాండవ రంగారావు, వెంకటేశ్వరరెడ్డి, కళావతి, కర్నా హనుమయ్య, జొన్నలగడ్డ రాజు, కె.అనిల్, చంటి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ఉసురు పోసుకోవద్దు
విపక్ష నేతలకు మంత్రి హరీ్‌శ్‌రావు విజ్ఞప్తి జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): కరువు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుని పాలమూరు జిల్లా ప్రజల ఉసురుపోసుకోవద్దని ప్రతిపక్ష పార్టీలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు విజ్ఙప్తి చేశారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు 90 శాతం పనులు పూర్తయ్యాయని, కేవలం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని తెలిపారు. ‘మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించవద్దు’ అని విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా కేవలం 60 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 40 శాతం పనులు చేపట్టాల్సి ఉందన్నారు. జిల్లాలో మరో 4 లక్షల కొత్త ఆయకట్టు పెంచుతున్నామన్నారు. జీఓ 123 ప్రకారం రైతులకు రెట్టింపు పరిహారం ఇస్తున్నామని, భూ సేకరణ అడ్డుకుని జిల్లా ప్రజల నోట్లో మన్ను కొట్టవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాల్‌రాజు, మర్రి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
నీడలా వెంటాడుతాం..
కరువు సహాయక చర్యల్లో టీఆర్ఎస్ సర్కారు మీనమేషాలు ఓట్లు, సీట్లు, నోట్లు తప్ప ప్రజలగోడు పట్టదా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కరువు జిల్లాగా ప్రకటించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా ముకరంపుర : ‘టీఆర్ఎస్ సర్కారు ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఓట్లు, సీట్లు, నోట్ల రాజకీయాలే తప్ప ప్రజాసంక్షేమా న్ని పట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా.. సహాయక చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కరువుపై చర్చిస్తే పరువుపోతుందని భావిస్తున్న రాష్ట్ర సర్కారుపై తిరుగుబాటుకు ఈ ధర్నా కనువిప్పు కావాలి. కరువుపీడిత ప్రాంతాలకు న్యాయం జరిగే వరకూ... ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకూ ప్రభుత్వాన్ని నీడలా వెంటాడుతూనే ఉంటాం.. రాజీలేని పోరాటం చేస్తూనే ఉంటాం..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హెచ్చరించారు. జిల్లాను కరువుప్రాంతంగా ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపట్టారు. కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న కరువుతో చేతివృత్తులు, పేద, బడుగుబలహీనవర్గాల ప్రజలు 40 లక్షల మంది ఇప్పటికే పల్లెలను వదిలి వలసబాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని ఎద్దేవా చేశారు. అనేక వాగ్దానాలతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్.. హామీలన్నింటినీ నీటిమూటలు చేసిందన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన శ్రీకాంతాచారి నుం చి ఆదిరెడ్డి వరకు ఆత్మబలిదానాలనూ ప్రభుత్వం విస్మరించిందన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీతోపాటు కేజీటూపీజీ ఉచిత విద్యను అమలు చేస్తామన్న సీఎం ఆ ఊసే మరిచారన్నా రు. రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయనకున్న వారి ఆశలకు భంగపాటే ఎదురవుతోందన్నారు. రెండేళ్ల పాలనలో ఆ పార్టీ బలోపేతం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కరువుపై దృష్టి మళ్లించేందుకే.. కరువుపై చర్చలేకుండా.. ప్రజల దృష్టిని మరల్చడానికే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ఎత్తుకున్నారని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా కనీసం తాగునీరు కూడా అందించలేకపోవడం కేసీఆర్ పాలనకు అద్దంపడుతోందన్నారు. రెండేళ్లలో టీఆర్ఎస్ సర్కారు లక్షల కోట్ల అప్పు చేయడం తప్ప సాధించిందే మీ లేదన్నారు. తుదిదశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ దోపిడీ చేసేందు కు కొత్తగా ప్రాజెక్టుల రీడైజైన్లు అంటూ ముందుకుపోవడమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు అందించిన సహాయంపై శ్వేత ప త్రం విడుదల చేయాలన్నారు. కరువు ప్రాంతాల్లో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు, వాణి జ్య పంటలకు రూ.20 వేల పరిహారమందిస్తూ పన్నులు, ఫీజులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారింగా నిర్వహించకపోతే పలెపల్లెనా జాతీయ జెండాలు ఎగిరే సి ఘనంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు అధ్యక్షతన జరిగిన ధర్నాలో రాష్ట్ర కార్యదర్శులు చింత సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, కాశిపేట లింగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు, రాష్ట్ర మహిళామోర్చా అధ్యక్షురాాలు పద్మజారెడ్డి, నాయకులు బల్మూరి వనిత, ఆకుల విజయ, జిల్లా కార్యదర్శులు కన్నం అంజయ్య, కొత్త శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, ఆది శ్రీనివాస్, నారాయణరావు, ఆది కేశవరావు, కోమల ఆంజనేయులు, జగన్మోహన్రావు, ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, హన్మంత్‌గౌడ్, లింగంపల్లి శంకర్ తదితరులున్నారు. లక్ష్మణ్‌కు ఘనంగా స్వాగతం బీజేపీ రాష్ట్ర సారథిగా జిల్లాకు తొలిసారిగా వచ్చిన లక్ష్మణ్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారుు. ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి కలెక్టరేట్‌కు భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్, రామగుండం బీజేపీ నాయకుడు కౌశిక్ హరి ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వేదికపైకి బండి సంజయ్‌ను ఆహ్వానించగానే కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు. కౌశిక్ హరి లక్ష్మణ్‌కు కండువా కప్పారు. బైక్‌ర్యాలీలో బాస సత్యనారాయణ, బేతి మహేందర్‌రెడ్డి, కౌశిక్‌హరి, గడ్డం నాగరాజు, కోమల మహేశ్, లక్ష్మణ్, లక్ష్మినర్సయ్య ఉన్నారు. వేదికపై బీజేపీ సాంస్కృతిక విభాగం కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
కరువు జిల్లాగా ప్రకటించాలి
► పెద్దపల్లి ఆర్డీవో ఆఫీస్ ఎదుట సీపీఐ ఆందోళన ► కలెక్టరేట్ ఎదుట సీపీఎం పెద్దపల్లిరూరల్ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఆర్డీవో ఆఫీస్ ఎదుట గురువా రం ఆందోళన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకటరెడ్డి, గుండా మల్లేశ్ హాజరయ్యూరు. వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పడ్డ కరువుతో ప్రజలు విలవిలలాడుతున్నారన్నారు. కొక్కిస రవీందర్‌గౌడ్, తాండ్ర సదానందం, తోట బాలమల్లయ్య, తాళ్లపెల్లి లక్ష్మణ్ తదితరులున్నారు. కరువు నివారణ చర్యలు చే పట్టాలి ముకరంపుర : జిల్లాలో కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఎం కరీంనగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య మా ట్లాడుతూ జిల్లాలో కేవలం 19 మండలాలను కరువు ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయన్నారు. ఉపాధి కూలీలకు పనిచేసిన వారంలోపు కూలి చెల్లించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ ఎల్లంపల్లి నీటిని జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగించాలన్నారు. డీఆర్వో వీరబ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. డివిజన్ కార్యదర్శి గుడికందుల సత్యం, వర్ణ వెంకట్‌రెడ్డి, భీమాసాహెబ్, రమేశ్, కవ్వంపెల్లి అజ య్, సదానందం, పి.రవి, ఎల్లయ్య, శేఖర్, లావణ్య, వ నజ, అనిల్, రాజు, రమేశ్‌యాదవ్ పాల్గొన్నారు. అంబలికేంద్రం ప్రారంభం కరీంనగర్ : సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక కేడీసీసీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పైడిపల్లి రాజు, పంజాల శ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు. -
పైసల్లేవ్!
♦ ఇన్పుట్ సబ్సిడీ విడుదలపై మీనమేషాలు ♦ కరువు జిల్లాగా ప్రకటించినప్పటికీ ♦ సాయంపై దాటవేత తక్షణ సాయం చేస్తే ♦ ఖరీఫ్ అవసరాలకు ఉండవని భావన ♦ మే, జూన్‌లోనే రాయితీ నిధులొచ్చే అవకాశం మునుపెన్నడూలేని విధంగా జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. పంటల్లేక అన్నదాతలు వలసబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం కేంద్ర కరువు బృందం పర్యటించి జిల్లాలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. గత ఖరీఫ్‌లో జరిగిన భారీ నష్టానికి సాయం చేస్తామంటూ భరోసా ఇచ్చింది. అతిత్వరలోనే తమ ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ పడుతుందని భావించిన రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురైంది. వీటిని ఇప్పట్లో విడుదలచేసే అవకాశం లేదని, మే, జూన్ వరకు ఆగాల్సిఉంటుందనే ప్రభుత్వ సంకేతాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అడుగంటిన జలాలు.. పశుగ్రాసం కొరత, కబేలాకు తరలుతున్న పశువులను చూసి బావురుమంటున్న అన్నదాతలకు అపన్నహస్తం అందించాల్సిన ప్రభుత్వం.. నిర్లిప్త వైఖరిని అవలంబిస్తోంది. ఇప్పటికిప్పుడు పంట రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ)ని అందజేస్తే ఖరీఫ్ సీజన్లో అవి కరిగిపోతాయని భా వించి ఉద్దేశపూర్వకంగా నిధుల విడుదలలో జా ప్యం చేస్తున్నదని తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి కూడా సంకేతాలు పంపింది. కరువు నిధుల కోసం ఒత్తిడి చేయవద్దని మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో కరువుకోరల్లో చిక్కుకున్న రైతాంగానికి క ష్టాలు తప్పేలా లేవు. కరువు దరువు గత ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం కూడా న మోదు కాకపోవడంతో దారుణంగా పంటలు దె బ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,00,931.72 హెక్టార్ల విస్తీర్ణంలోని పంటలు తుడుచుకు పెట్టుకుపోయిన ట్లు జిల్లా వ్యవసాయశాఖ లెక్క తేల్చింది. ఈ మేరకు 2,03,275 మంది రైతులు నష్టపోయారని, పంటనష్టం రూ.73.33 కోట్ల మే ర జరిగిందని అంచనా వేసింది. ఇదే నివేదికను మూడు నెలల క్రితం జిల్లాలో పర్యటించిన కేంద్ర కరువు బృందానికి జిల్లాయంత్రాంగం సమర్పిం చింది. ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, పరిగి, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు సాగించిన ప్రతినిధి బృందం కరువు పరిస్థితులను చూసి చలించిపోయింది. వేగంగా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని,తక్షణ సాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చింది. దీంతో ఊరటచెందిన రైతులు నేడో, రేపో ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు తమ ఖాతాల్లో పడతాయని ఆశించారు. అయితే బృందం కేంద్రానికి నివేదిక సమర్పించడంలో జాప్యం ప్రదర్శించింది. కరువు పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర సర్కారు కూడా నిధుల విడుదలకు సానుకూలంగానే స్పందించిం ది. అయితే, ఈ నిధులను ఇప్పటికిప్పుడు ఇస్తే ఖర్చయిపోతాయని, ఖరీఫ్ అవసరాలకు వాడుకునేలా మే, జూన్‌లో ఇస్తే ఎలా ఉంటుందనే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ సంకేతాలను అధికారులకు పంపింది. దీంతో ఇన్పుట్ సబ్సిడీ కోసం మరికొన్నాళ్లు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
కరువు జిల్లాగా ప్రకటించాలని రాస్తా రోకో
ఖమ్మం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాస్తా రోకో నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం రహదారుల దిగ్బంధం కార్యక్రమం జరిగింది. కార్యకర్తలు కూసుమంచి మండలం నాయకర్ గూడెం వద్ద సుమారు గంటన్నరపాటు జాతీయ రహదారిని దిగ్బందించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సుదర్శన్, డివిజన్ కార్యదర్శి లెనిన్, మండల కార్యదర్శి వెంకటరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రోత్సాహం లేదు
ఉద్యమించిన పాడి రైతులు చిక్కబళ్లాపురం కలెక్టరేట్ ముట్టడి చిక్కబళ్లాపురం :నిబంధనల పేరుతో పాల సేకరణలో ఇక్కట్లకు గురి చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై పాడి రైతులు మండిపడ్డారు. బుధవారం చిక్కబళ్లాపురం కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. అంతకు ముందు కెఎంఎఫ్ డెరైక్టర్ కె.వి.నాగరాజు నేతృత్వంలో వేలాది మంది పాడి రైతులు స్థానిక ఎపీఎంసీ యార్డు నుంచి శిడ్లఘట్ట సర్కిల్ చేరుకుని ఏడవ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ... ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 3.5 ఫ్యాట్ 8.5ఎస్ఎన్ఎఫ్ పాలు సరఫరా చేసే వారికి మాత్రమే రూ. 4 మద్దతు ధర అందజేస్తోందని తెలిపారు. ఈ విధానం వల్ల పాడి రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నారని అన్నారు. కరువు జిల్లాలో ఉన్న కొద్ది పాటి నీటి వనరులతోనే పాడి పరిశ్రమ అభివృద్ధికి రైతులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కర్ణాటకలో ప్రతి లీటరు పాలకు రూ. 29 చెల్లిస్తున్నారని, అదే ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఒక లీటరు పాలకు రూ. 36 ఇస్తున్నారని వివరించారు. కర్ణాటకలోనూ లీటరు పాలకు రూ. 36 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ చేరుకుని ముట్టడి చేశారు. ఈ సందర్భంగా నగరంలో పాడి రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తాలూకా విశ్వేశ్వర్య పాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పాడి రైతులు పాల్గొన్నారు. -
పండుగ కళ ఏదీ?
- ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు - కరువుతో కటకటపడుతున్న పల్లెసీమలు కదిరి: ఓవైపు కరువు, మరోవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఫలితంగా కరువు జిల్లాలో పండుగలు కళ తప్పుతున్నాయి. కిలో బియ్యం రూపాయికి అందజేస్తున్న ప్రభుత్వం నిత్యావసర ధరలను అదుపు చేయలేకపోతోంది. సామాన్యులు, మధ్య తరగతివారు ఎందుకొచ్చిన పండుగలురా.. బాబూ అని నిట్టూరుస్తున్నారు. వినాయక చవితి అనగానే కొత్త అల్లుళ్లు పండుగకు అత్తగారిల్లు చేరతారు. నూతన వస్త్రాలతో పిండి వంటలతో ఏ ఇళ్లు చూసినా పండుగ కళతో నిండిపోయేది. ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు. కాగుతున్న నూనెలు: వంట నూనె లేనిదే పండుగ లేదు. కిలో వేరుశనగ నూనె రూ.110 నుంచి 120, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.90, వనస్పతి రూ.60, పామాయిల్ రూ.60 ఇలా వంటనూనె ధరలు స్టౌ మీద పెట్టకనే కాగిపోతున్నాయి. బెల్లం ధర చక్కెరను మించిపోయింది. కిలో చక్కెర రూ. 40 కాగా, బెల్లం రూ. 50 పలుకుతోంది. పప్పులు..నిప్పులు: కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలా ఏ పప్పు ధర చూసినా సరాసరి రూ. 80 పలుకుతోంది. వేరుశనగ పప్పు ఎన్నడూ లేనివిధంగా ఈసారి కిలో రూ. 90కి చేరింది. కంది, పెసరపప్పుతో పోలిస్తే కాస్త తక్కువగా వుండే శనగపప్పు కూడా రూ.80కి అమ్ముతున్నారు. మార్కెట్లో సన్నబియ్యం ధ రలు అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి సంగతే మరచినట్టుంది. ఇప్పుడు బియ్యం కిలో రూ 36 నుంచి రూ. 40 ధర పలుకుతోం ది. కిలో మైదా రూ 25 నుంచి 30, గోధుమపిండి రూ. 30, చింతపండు రూ. 60 నుంచి 80, ఎండుమిర్చి రూ. 80కి అమ్ముతున్నారు. ధరల కారణంగా వ్యాపారా లు కూడా అంతంతమాత్రమే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. బోసిపోయిన పల్లెలు: పండుగల సమయంలో పల్లెలు కళకళలాడేవి. కానీ ఏ గ్రామం చూసినా జనంలేక బోయిపోయింది. ప్రతి ఇంటికీ తాళాలే కన్పిస్తున్నాయి. ముసళోల్లు, చిన్నపిల్లలు మాత్రం గ్రామాల్లో కనిపిస్తున్నారు. మిగిలిన వారి సంగతి అడిగితే బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లారని చెబుతున్నారు. -
కరువు జిల్లాగా జెడ్పీలో తీర్మానం చేస్తాం
త్రిపురారం : వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు జిల్లాగా జెడ్పీ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ వెల్లడించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ దూళిపాల ధనలక్ష్మీరామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన మొదటి సర్వసభ్య సమావేశానికి ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని అధికారులు ఇప్పటి నుంచే యాక్షన్‌ప్లాన్ తయారు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో మంచినీటి సమస్యకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరువు తీవ్రం కావడంతో ప్రస్తుత ఖరీఫ్‌లో వేసిన పంటలు నిలువునా ఎండిపోతున్నాయన్నారు. ఒక పక్క విద్యుత్ సమస్య మరో పక్క తీవ్ర వర్షాభావంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సాగర్ ఎడవ కాలువకు 11 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్నారు. లిఫ్ట్‌లకు 16 గంటల పాటు విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు, ప్రజా ప్రతి నిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని కోరారు. అనంతరం జెడ్పీ చైర్మన్ బాలునాయక్, ఎంపీ గుత్తా లను ఎంపీపీ దూళిపాల ధనలక్ష్మీరామచంద్రయ్య, గిరిజన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ధన్సింగ్ నాయక్, మండల ప్రజా పరిషత్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అనుముల ప్రేమలత, ఎంపీడీఓ శ్రీరామకవచం రమేష్, ఆర్అండ్బీ డీఈ రఘవీర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏఎమ్మార్పీకి నీటి నివిడుదల చేయాలి పెద్ద అడిశర్లపల్లి : వర్షాభావ పరిస్థితులు, కరెంటు కోతల నేపథ్యంలో ఏఎమ్మార్పీకి ప్రభుత్వం వెంటనే నీటివిడుదల చేసి రైతులను ఆదుకోవాలని న ల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. శనివారం ఆయన జెడ్పీచైర్మన్ బాలునాయక్‌తో కలిసి మండలంలోని ఏకేబీఆర్ వద్ద విలేకరులతో మాట్లాడారు. వర్షాధార పంటలపై ఆధారపడిన జిల్లా రైతాంగానికి ప్రాజెక్టు ద్వారా పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలని అన్నారు. -
ప్చ్... హామీలకు రాం..రాం
సాక్షి ప్రతినిధి, కర్నూలు : కరువు జిల్లాపై ప్రభుత్వం కనికరం చూపలేదు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయలేదు. కనీసం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నమూ కనిపించలేదు. బుధవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా వాసులను తీవ్ర నిరాశ పరిచింది. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. కానీ.. జిల్లా ప్రజలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీపై కూడా బడ్జెట్లో ప్రస్తావన రాలేదు. ఓర్వకల్లు వద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీని మరిచారు. ఆదోని-ఎమ్మిగనూరు మధ్యలో టెక్స్టైల్, అపెరల్ పార్క్ ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి నుంచే కొనుగోళ్లు చేయిస్తానని ప్రకటించి..నిధులు మంజూరు చేయలేదు. త్రిపుల్ ఐటీ, నంద్యాలలో వ్యవసాయ కళాశాలలను డీమ్డ్ యూనివర్సిటీగా మార్పు.. విత్తన సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనలకు మౌలిక వసతులు కల్పన.. ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు, నిమ్స్ తరహాలో రాయలసీమ ఇన్స్టిట్యూఫ్ ఆఫ్ మెడికల్ సైన్స్.. డోన్‌లో ధన్‌బాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ మైనింగ్ తరహా సంస్థను ఏర్పాటు.. ఇలా ఎన్నో హామీలిచ్చినా.. ఒక్కటంటే ఒక్కదానికి కూడా నిధులు మంజూరు చేయలేదు. హామీలకు ‘నీళ్లొదిలారు..’ స్వాతంత్య్రదిన వేడుకలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, హెచ్ఎల్సీ, హంద్రీనీవా, గాలేరునగరి, గోరుకల్లు వంటి ప్రాజెక్టులన్నింటికి నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తానని సీఎం హామీ ఇచ్చారు. అదే విధంగా గుండ్రేవుల, గురురాఘవేంద్ర రిజర్వాయర్లు తన కల అన్నారు. అవన్నీ కేవలం మాటలకే పరిమతమని తేలిపోయింది. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ సర్కిల్-1, సర్కిల్-2, సర్కిల్-3 మొత్తానికి కలిపి రూ.145 కోట్లకుపైనే అవసరమని అధికారులు అంచనాలు పంపారు. అయితే బడ్జెట్లో రూ.12.48 కోట్లే కేటాయించారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు రూ.1.20 కోట్లు అవసరమైతే బడ్జెట్లో రూ.20 లక్షలు మాత్రమే కేటాయించారు. వరదరాజస్వామి ప్రాజెక్టుకు రూ.2.01 కోట్లు, కేసీ కెనాల్ ఆధునికీకరణ కోసం రూ.8.04 కోట్లు, గురురాఘవేంద్ర లిఫ్ట్ఇరిగేషన్కు రూ.15 కోట్లు కేటాయించారు. తుంగభద్ర లోలెవల్ కెనాల్‌కు రూ.8.22 కోట్లు, హైలెవల్ కెనాల్ స్టేజ్-1కి రూ.15 కోట్లు, స్టేజ్-2కి 2.20 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. మొత్తంగా చూస్తే జిల్లాలోని రిజర్వాయర్లు, కాలువలకు కేటాయించింది తక్కుకవేనని నీటి పారుదలశాఖ అధికారులు చెపుతున్నారు. వ్యవ‘సాయం’ కరువే.. టీడీపీ అధికారంలోకి వస్తే రైతు, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయానికి, రుణమాఫీకి కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ ప్రస్తావనే రాలేదు. అదే విధంగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అన్నారు. అది కూడా లేదు. కరువు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించలేదు. ఇక గృహ నిర్మాణం, పలు సంక్షేమ పథకాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్దికి తూతూ మంత్రంగా నిధులు విదిల్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ అనుమానమే? ఫీజు రీఎంబర్స్ మెంట్‌పై ఆధారపడి జిల్లాలోని సుమారు 90 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఈ పథకాన్ని అమలు చేయడం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అందుకు బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించిన నిధులే కారణం. విద్యార్థులకు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నిధుల కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికి గతంలో రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. ఆ ప్రస్తావన లేదు. వైద్యం.. దైవాధీనం 108 సర్వీసులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను పటిష్టం చేయాల్సి ఉంది. జిల్లాలోని పీహెచ్‌సీల్లో సుమారు సగానికిపైగా నిర్వహణలోపంతో అస్తవ్యస్తంగా మారాయి. అలాగే జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన వైద్యసదుపాయాలు లేవు. 104 సేవలు పల్లె జనానికి అందటం లేదు. ఉన్న 108 సర్వీసులకు తోడు అదనంగా మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. కర్నూలులోని పెద్దాసుపత్రికి ఇప్పటికే రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ ప్రస్తావన రాలేదు. ప్రభుత్వ వైద్యశాల ఆధునికీకరణ, మందుల కొనుగోలుకు నిధులు అంతంత మాత్రంగానే ఉంది. రహదారులు బాగుపడేదెన్నడో..? జిల్లాలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉంది. 25 ఏళ్ల క్రితం వేసినవి కంకరతేలి ప్రయాణం నరకంగా మారింది. సరిహద్దు గ్రామాలకు వెళ్లడానికి సైతం ఇప్పుడు అధికారులు భయపడుతున్నారు. అత్యవసర చికిత్స కోసం వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. రహదారుల అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. అదే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు అంకెల గారడీని తలపిస్తోంది.