కరువు జిల్లాగా ప్రకటించాలి
► పెద్దపల్లి ఆర్డీవో ఆఫీస్ ఎదుట సీపీఐ ఆందోళన
► కలెక్టరేట్ ఎదుట సీపీఎం
పెద్దపల్లిరూరల్ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరీంనగర్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఆర్డీవో ఆఫీస్ ఎదుట గురువా రం ఆందోళన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకటరెడ్డి, గుండా మల్లేశ్ హాజరయ్యూరు. వారు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పడ్డ కరువుతో ప్రజలు విలవిలలాడుతున్నారన్నారు. కొక్కిస రవీందర్‌గౌడ్, తాండ్ర సదానందం, తోట బాలమల్లయ్య, తాళ్లపెల్లి లక్ష్మణ్ తదితరులున్నారు.
కరువు నివారణ చర్యలు చే పట్టాలి
ముకరంపుర : జిల్లాలో కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ సీపీఎం కరీంనగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య మా ట్లాడుతూ జిల్లాలో కేవలం 19 మండలాలను కరువు ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయన్నారు. ఉపాధి కూలీలకు పనిచేసిన వారంలోపు కూలి చెల్లించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి మాట్లాడుతూ ఎల్లంపల్లి నీటిని జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి ఉపయోగించాలన్నారు. డీఆర్‌వో వీరబ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. డివిజన్ కార్యదర్శి గుడికందుల సత్యం, వర్ణ వెంకట్‌రెడ్డి, భీమాసాహెబ్, రమేశ్, కవ్వంపెల్లి అజ య్, సదానందం, పి.రవి, ఎల్లయ్య, శేఖర్, లావణ్య, వ నజ, అనిల్, రాజు, రమేశ్‌యాదవ్ పాల్గొన్నారు.
అంబలికేంద్రం ప్రారంభం
కరీంనగర్ : సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక కేడీసీసీ బ్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన అంబలి కేంద్రాన్ని గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అంబలి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పైడిపల్లి రాజు, పంజాల శ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు.