ప్రభుత్వ కార్యాలయాలు తరలించొద్దు | cpi against to shifted government offices in yadadri | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యాలయాలు తరలించొద్దు

Published Sat, Oct 29 2016 3:54 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

cpi against to shifted government offices in yadadri

యాదగిరిగుట్ట: యాదాద్రిలో అభివృద్ధి నెపంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోద శ్రీరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే అశాస్త్రీయంగా ఆర్టీసీ డిపోతోపాటు బస్టాండు వంటివి తరలిస్తే ఎంతోమంది చిరు వ్యాపారులు జీవనోపాధి కోల్పోవడంతోపాటు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ కార్యాలయాల తరలింపు విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని శ్రీరాములు కోరారు. కాగా, ఈ విషయమై వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావును కలిసి విజ్ఞప్తి చేస్తామని కూడా ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement