తెలంగాణలోనూ గెలుస్తాం | Union Minister Pon Radhakrishnan win in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలోనూ గెలుస్తాం

Published Fri, Apr 14 2017 12:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

తెలంగాణలోనూ గెలుస్తాం - Sakshi

తెలంగాణలోనూ గెలుస్తాం

కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌
సాక్షి, వరంగల్‌: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధి కారంలోకి వస్తుందని కేంద్ర ఉపరితల రహదారులు, ఓడ రేవులశాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణన్‌ అన్నారు.  బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్క రించుని పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా కేంద్రమంత్రి పొన్ను రాధాకృష్ణన్‌ గురువారం వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించారు. వరంగల్‌ ప్రజలతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు.

 వర్ధన్న పేట నియోజకవర్గం ఇల్లందలో దళితవాడలో సహపంక్తి భోజనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ ఉద్యమాలు చేసింది. బీజేపీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. టీఆర్‌ఎస్‌కు ఉన్న ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాలేదు. 2014 ఎన్నికల్లో  చాలా కారణాలతో తెలంగాణలో గెలవలేకపోయాం.  వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం’ అని అన్నారు.   సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్, కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement