Union Minister Pon Radhakrishnan
-
తెలంగాణలోనూ గెలుస్తాం
కేంద్ర మంత్రి పొన్ను రాధాకృష్ణన్ సాక్షి, వరంగల్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీ అధి కారంలోకి వస్తుందని కేంద్ర ఉపరితల రహదారులు, ఓడ రేవులశాఖ మంత్రి పొన్ను రాధాకృష్ణన్ అన్నారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్క రించుని పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా కేంద్రమంత్రి పొన్ను రాధాకృష్ణన్ గురువారం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించారు. వరంగల్ ప్రజలతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. వర్ధన్న పేట నియోజకవర్గం ఇల్లందలో దళితవాడలో సహపంక్తి భోజనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ ఉద్యమాలు చేసింది. బీజేపీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. టీఆర్ఎస్కు ఉన్న ఇద్దరు ఎంపీలతో తెలంగాణ రాలేదు. 2014 ఎన్నికల్లో చాలా కారణాలతో తెలంగాణలో గెలవలేకపోయాం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం’ అని అన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణయం వారిదే!
సాక్షి, చెన్నై : సంప్రదింపులతో చర్చలు సాగాయని, ఇక నిర్ణయం వారి చేతుల్లో అంటూ పీఎంకే, డీఎండీకేలకు పొత్తు విషయంగా కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. తమ వెంట పన్నెండు పార్టీలు ఉన్నాయని, ఆ ఇద్దరు కలసి వస్తే బలం పెరిగినట్టేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక, సీనియర్ నటుడు విజయకుమార్ కమలంకు మద్దతు ప్రకటించారు. రాష్ర్టంలో అధికారం తమదే అన్నట్టుగా గతంలో ధీమా వ్యక్తం చేసిన కమలనాథులు, ఇక మౌనముద్రతో ముందుకు సాగుతున్నారు. ప్రాంతీయ పార్టీలు షాక్ ఇచ్చినా, చివరి క్షణంలో తమతో కలసి వస్తాయన్న ఆశతో ఎదురు చూపుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి తమతో కలిసి వచ్చిన చిన్నా చితక పార్టీల్ని అక్కున చేర్చుకున్న బీజేపీ పెద్దలు, వారికి సీట్ల పంపకాల మీద దృష్టి పెట్టారు. ఇందుకు తగ్గ కసరత్తుల్లో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పూర్తిగా నిమగ్నమయ్యారు. బుధవారం అఖిల భారత ముస్లిం మున్నేట్ర కళగం నేత సదర్ అబ్దుల్లా, ఇండియ మున్నేట్ర కల్వి కళగం నేత దేవనాదం, దక్షిణ భారత ఫార్వడ్ బ్లాక్ నేత తిరుమగన్లతో సీట్ల పంపకాల చర్చల్లో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పొన్ రాధాకృష్ణన్‌ను మీడియా కదిలించగా, తమ వెంట పన్నెండు పార్టీలు నడిచేందుకు సిద్ధమయ్యాయని ఆయన వివరించారు. బలమైన కూటమి ఏర్పాటు చేయాలన్న కాంక్షతో ఆ దిశగా ప్రయత్నాలు సాగించామని, డీఎండీకే, పీఎంకేలతోనూ చర్చలు సాగాయని పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం అవుతున్నదని, ఈనెలాఖరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రజాహితం కాంక్షించే దిశగా ఈ మేనిఫెస్టో ఉండబోతోందని, కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ద్వారానే రాష్ర్ట సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యం అని తద్వారా ప్రజల్లోకి వెళ్లబోతున్నామన్నారు. డీఎండీకే, పీఎంకేలతో సంప్రదింపులు, చర్చలు సానుకూలంగానే సాగాయని, అయితే, నిర్ణయం అన్నది వారి చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. వారి నిర్ణయాల మేరకు తుది నిర్ణయాన్ని బీజేపీ ప్రకటిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక, సీనియర్ నటుడు విజయకుమార్ పొన్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. తన మద్దతును బీజేపీకి ప్రకటించారు. ఇప్పటికే పలువురు నటీ మణులు, నెపోలియన్ వంటి నటులు బీజేపీలో చేరిన దృష్ట్యా, త్వరలో వారు అధికారికంగా కమలం తీర్థం పుచ్చుకునేందుకు విజయకుమార్ సిద్ధమవుతున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరఫున ప్రచారం సాగించేందుకు విజయకుమార్ వ్యాఖ్యానించినట్టుగా కమలాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
‘చొక్కా’ విప్పేస్తాం
నిరసనకు రె డీ వీరమణికి రాధా హెచ్చరిక సాక్షి, చెన్నై: ‘తాళి బొట్లు తెంచే పనిలో మీరుంటే, నల్ల చొక్కాలు విప్పి పడేసి నిరసన బాటకు తామూ సిద్ధమవుతాం’ అని ద్రవిడ కళగం నేత కీవీరమణిని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించారు. ద్రవిడ కళగం నేతృత్వంలో తాళి బొట్లను తెంచేసే నిరసనను ఇటీవల చేపట్టిన విష యం తెలిసిందే. హైకోర్టు అక్షింతలు వేయడం, స్టే విధించడం వెరసి ద్రవిడ కళగం నేతలు వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో ఇకనైనా సంస్కృతిని కించ పరిచే విధంగా, మహిళల మనో భావాలను దెబ్బ తీసే రీతిలో వ్యవహరిస్తే సహించబోమని ద్రవిడ కళగం నేతకు కేంద్ర నౌకాయన శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తీవ్ర హెచ్చరిక చేశారు. ద్రవిడ కళగం నేతలు ఎల్లప్పుడు నల్ల చొక్కాలను ధరిస్తున్న విషయం తెలిసిందే. ఇది వారి మనోగతం. నాస్తికులుగా చెప్పుకునే ఆ కళగం నాయకులకు ఆ రంగు చొక్క ఓ యూనిఫాంగా చెప్పవచ్చు. తాజాగా, ఆ నల్ల చొక్కాను కించ పరిచే విధంగా నిరసనకు సిద్ధం కావాల్సి ఉంటుంద రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించడాన్ని ద్రవిడ కళగం నేతలు తీవ్రంగా పరిగణించే పనిలో పడ్డారు. చొక్కా విప్పుతాం: సోమవారం పొన్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, ద్రవిడ కళగం నాయకుల్ని టార్గెట్ చేసి తీవ్రంగా స్పందించారు. ద్రవిడ ముసుగులో ఇతరుల మనో భావాలను కించ పరిచే విధంగా వ్యవహరిస్తే సహించబోమనని మండి పడ్డారు. తాళి అన్నది సంస్కృతిలో భాగం అని, దీనిని ప్రతి మహిళల పవిత్రంగా భావిస్తున్నారన్నారు. అన్ని మతాల వారికి తాళి అన్నది పవిత్రకు చిహ్నం అని, అయితే, దీనిని తెంచి పడేస్తాం అని ద్రవిడ కళగం నేతలు ప్రకటించడం శోచనీయమని విమర్శించారు. తమిళ సంస్కృతిని పరిరక్షిస్తామని చెప్పుకునే వాళ్లు, ఆ సంస్కృతిలో భాగంగా ఉన్న తాళిని అవహేళన చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలకు , సంస్కృతికి వ్యతిరేకంగా ఎవ్వరు వ్యవహరించినా సరే కఠినంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నల్ల రంగు చొక్కాలను ఏదేని విషాద ఘటనలు జరిగి ఉంటే, ధరించడం ఆనవాయితీ అని పేర్కొంటూ, ఆ రంగు చొక్కాలను ధరించిన వాళ్లకు తాము కూడా గుణ పాఠం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నామన్నారు. తాళిని అవహేళన చేస్తే, ఆ నల్ల చొక్కాలను విప్పి పడే సి పరిహసించే రీతిలో రాష్ట్ర వ్యాప్త నిరసనకు బిజేపి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఎవరి నమ్మకం వారిదని, ఎవరి హక్కులు వారివి అని పేర్కొంటూ, ఒకరు మరొకరి నమ్మకం, హక్కుల్లో జోక్యం చేసుకోవడం ఇకనైనా మానుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పదన్నారు. సంస్కృతిని, మహిళలను కించ పరిచే విధంగా వ్యవహరించిన కీ . వీరమణి అండ్ బృందంపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు. -
‘సేతు’కు కేంద్రం సై
* కేంద్ర మంత్రి పొన్కు మారిన బాధ్యతలు * పరపతి పెంచుకునే పథకం చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో బలపడేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్న కేంద్ర ప్రభుత్వం సేతు సముద్ర పథకంపై దృష్టిపెట్టింది. అమలుకు నోచుకోక ఎన్నో ఏళ్లుగా వివాదంలో చిక్కుకుపోయిన ఈ పథకాన్ని పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు సిద్ధం అయింది. కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్‌కు నౌకాయాన శాఖా మంత్రిత్వ బాధ్యతలను అప్పగించడం ఇందుకు ఉదాహరణ. భారత్-శ్రీలంక మధ్య నౌకాయానాన్ని నెలకొల్పడం కోసం ఈ రెండు దేశాలను కలుపుతూ సేతు సముద్ర ప్రాజెక్టుకు గత యూపీఏ ప్రభుత్వం సంకల్పిం చింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆనాడు శ్రీలంకకు చేరుకునేందుకు శ్రీరాముడు కట్టిన వారధిగా భావిస్తున్న రామసేతు వంతెన బయటపడింది. సేతు సముద్ర ప్రాజెక్టు వల్ల చారిత్రాత్మక రామసేతు వంతెన ధ్వంసం అయిపోగలదనే వివాదం తలెత్తింది. రామసేతు వంతెనను పురాతన చిహ్నంగా ప్రకటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయగా, ఆందోళనలు సాగిస్తూ మరి కొందరు కోర్టుకెక్కారు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో యూపీఏ ప్రభుత్వం సేతు సముద్ర ప్రాజెక్టును దాదాపుగా అటకెక్కించే సింది. బీజేపీ ఊతం: యూపీఏ ప్రభుత్వంలో తమిళ ప్రజలు నెరవేర్చుకోలేని పథకాలు, సమస్యలన్నీ బీజేపీ ప్రభుత్వానికి ఊతంగా మారాయి. ఇందులో భాగంగా సేతు సముద్ర ప్రాజెక్టు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరిపోయింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. సేతు సముద్ర పథకం పరిశీలించాలని నౌకాయాన శాఖా మంత్రి నితిన్ గడ్కారినీ రాష్ట్రానికి పంపారు. ఈనెల 5న నితిన్ సైతం ఆకాశ మార్గంలో పయనిస్తూ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరీశీలించారు. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మంత్రి పొన్ రాధాకృష్ణన్ సైతం నితిన్‌గడ్కారీ వెంట పర్యటించారు. రామసేతు వంతెన దెబ్బతినకుండా సేతుసముద్ర ప్రాజెక్టును పూర్తి చేస్థామని నితిన్ ఆనాడే హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టును వేగిరంగా పూర్తిచేయాలంటే రాష్ట్రంలో నమ్మకమైన వ్యక్తి అవసరం. నితిన్ పర్యటన ముగిసి ఐదురోజుల్లో కేంద్ర మంత్రి వర్గవిస్తరణ జరిగింది. భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రిగా వ్యవహిరిస్తున్న పొన్ రాధాకృష్ణన్ నౌకయాన శాఖా మంత్రిగా మారిపోయారు. సేతు సముద్రం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నౌకాయానశాఖ కేబినెట్ మంత్రిగా నితిన్ గడ్కారి ఇచ్చే సూచనలను అమలు చేసేందుకు అనువుగా సహాయ మంత్రి హోదాలో పొన్ సిద్ధమైపోయారు. సేతు సముద్ర ప్రాజెక్టును పరుగులెత్తించడం ద్వారా రాష్ట్రంలో పాతుకుపోయేందుకు బీజేపీ సమాయుత్తమవుతోంది.