‘చొక్కా’ విప్పేస్తాం
నిరసనకు రె డీ
వీరమణికి రాధా హెచ్చరిక
సాక్షి, చెన్నై: ‘తాళి బొట్లు తెంచే పనిలో మీరుంటే, నల్ల చొక్కాలు విప్పి పడేసి నిరసన బాటకు తామూ సిద్ధమవుతాం’ అని ద్రవిడ కళగం నేత కీవీరమణిని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించారు. ద్రవిడ కళగం నేతృత్వంలో తాళి బొట్లను తెంచేసే నిరసనను ఇటీవల చేపట్టిన విష యం తెలిసిందే. హైకోర్టు అక్షింతలు వేయడం, స్టే విధించడం వెరసి ద్రవిడ కళగం నేతలు వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలో ఇకనైనా సంస్కృతిని కించ పరిచే విధంగా, మహిళల మనో భావాలను దెబ్బ తీసే రీతిలో వ్యవహరిస్తే సహించబోమని ద్రవిడ కళగం నేతకు కేంద్ర నౌకాయన శాఖ సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తీవ్ర హెచ్చరిక చేశారు. ద్రవిడ కళగం నేతలు ఎల్లప్పుడు నల్ల చొక్కాలను ధరిస్తున్న విషయం తెలిసిందే. ఇది వారి మనోగతం. నాస్తికులుగా చెప్పుకునే ఆ కళగం నాయకులకు ఆ రంగు చొక్క ఓ యూనిఫాంగా చెప్పవచ్చు. తాజాగా, ఆ నల్ల చొక్కాను కించ పరిచే విధంగా నిరసనకు సిద్ధం కావాల్సి ఉంటుంద రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించడాన్ని ద్రవిడ కళగం నేతలు తీవ్రంగా పరిగణించే పనిలో పడ్డారు.
చొక్కా విప్పుతాం: సోమవారం పొన్ రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ, ద్రవిడ కళగం నాయకుల్ని టార్గెట్ చేసి తీవ్రంగా స్పందించారు. ద్రవిడ ముసుగులో ఇతరుల మనో భావాలను కించ పరిచే విధంగా వ్యవహరిస్తే సహించబోమనని మండి పడ్డారు. తాళి అన్నది సంస్కృతిలో భాగం అని, దీనిని ప్రతి మహిళల పవిత్రంగా భావిస్తున్నారన్నారు. అన్ని మతాల వారికి తాళి అన్నది పవిత్రకు చిహ్నం అని, అయితే, దీనిని తెంచి పడేస్తాం అని ద్రవిడ కళగం నేతలు ప్రకటించడం శోచనీయమని విమర్శించారు. తమిళ సంస్కృతిని పరిరక్షిస్తామని చెప్పుకునే వాళ్లు, ఆ సంస్కృతిలో భాగంగా ఉన్న తాళిని అవహేళన చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలకు , సంస్కృతికి వ్యతిరేకంగా ఎవ్వరు వ్యవహరించినా సరే కఠినంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
నల్ల రంగు చొక్కాలను ఏదేని విషాద ఘటనలు జరిగి ఉంటే, ధరించడం ఆనవాయితీ అని పేర్కొంటూ, ఆ రంగు చొక్కాలను ధరించిన వాళ్లకు తాము కూడా గుణ పాఠం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నామన్నారు. తాళిని అవహేళన చేస్తే, ఆ నల్ల చొక్కాలను విప్పి పడే సి పరిహసించే రీతిలో రాష్ట్ర వ్యాప్త నిరసనకు బిజేపి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఎవరి నమ్మకం వారిదని, ఎవరి హక్కులు వారివి అని పేర్కొంటూ, ఒకరు మరొకరి నమ్మకం, హక్కుల్లో జోక్యం చేసుకోవడం ఇకనైనా మానుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పదన్నారు. సంస్కృతిని, మహిళలను కించ పరిచే విధంగా వ్యవహరించిన కీ . వీరమణి అండ్ బృందంపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌చేశారు.