ప్రియుడి కోసం వెళ్లి..పోలీసుల చేతికి చిక్కి..! | Minor Girl Cheated By Traffic Police In Chennai City, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం వెళ్లి..పోలీసుల చేతికి చిక్కి..!

Published Sun, Feb 2 2025 3:23 PM | Last Updated on Sun, Feb 2 2025 4:45 PM

Minor Girl Cheated By Traffic Police In Chennai City

చెన్నై:ప్రియుడిని వెతుక్కుంటూ బయలుదేరిన ఓ 13 ఏళ్ల బాలిక పోలీసుల చేతిలోనే లైంగికదాడికి గురైంది. కాపాడాల్సిన పోలీసే ఆ బాలిక జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఇటీవల జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన  బాయ్‌ఫ్రెండ్‌ మాటలు నమ్మి ఓ బాలిక ఇంటి నుంచి పారిపోయి బయటికి వచ్చింది.

 రాత్రి వేళ కావడంతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిద్రపోయింది. ఇంతలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్‌ పోలీసు రామన్‌ సాయం చేస్తానని బాలికను జీపు ఎక్కించుకున్నాడు. వాహనంలోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి ట్రాఫిక్‌ పోలీసుల బూత్‌కు తీసుకెళ్లి బాలికపై మరోసారి లైంగిక దాడి చేశాడు.రామన్‌ నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాలిక ఇంటికి చేరింది.

అయితే తనకు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్న బాలిక ఇంటి నుంచి మళ్లీ పారిపోయింది బాలిక.ఈసారి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసింది. ఇద్దరు కలిసి ఒక చోట సహజీవనం మొదలు పెట్టారు. 

ఇంతలో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు బాలిక ఆచూకీ కనిపెట్టారు. బాలికను విచారించగా ట్రాఫిక్‌ పోలీసు రామన్‌ బాగోతం బయటపడింది. దీనికి తోడు బాయ్‌ఫ్రెండ్‌ కూడా తనపై లైంగికదాడి చేశాడని బాలిక పోలీసులకు తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement