సాక్షి, చెన్నై: అమల్లోకి వచ్చిన కొత్త చట్టం మేరకు చెన్నైలో 15 రోజుల్లో రూ.1.88 కోట్లను జరిమానా విధించి, వసూలు చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు 30 వేల కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వివరాలు.. చెన్నై నగరంలో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి భరతం పట్టే విధంగా మోటారు వాహనాల చట్టంలో సవరణలు చేసిన విషయం తెలిసిందే. గత నెల ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది.
హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారు, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు, సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్రకారు, రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారి భరతం పట్టే విధంగా పోలీసులు దూసుకెళ్లారు. హెల్మెట్ ధరించకుంటే, రూ. 1000, ఇన్సూరె న్స్ లేని వాహనాలకు రూ. 2 వేలు అంటూ భారీ జరిమానాలు విధించారు.
దీంతో గత పక్షం రోజుల్లోనే చెన్నైలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి 30,699 మందిపై కేసులు నమోదు చేశారు. వీరి నుంచి జరిమానా రూపంలో రూ. 1.88 కోట్లు వసూలు చేశారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అతివేVýæం ప్రమాదకరమని, కుటుంబాన్ని గుర్తెరిగి వాహ నాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు.
చదవండి: Bear Attack Video: రెచ్చిపోయిన ఎలుగుబంటి.. బైక్‌పై వెళ్తున్న వారిపై దాడిచేసి..
Comments
Please login to add a commentAdd a comment