
వాహనచోదకులకు జరిమానా విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, తనిఖీలు చేస్తున్న పోలీసులు
సాక్షి, చెన్నై: కొత్త మోటారు వెహికల్ యాక్ట్ అమల్లోకి రావడంతో ట్రాఫిక్ పోలీసులు బుధవారం నుంచి కొరడా ఝులిపించారు. కొన్ని చోట్ల జరిమానాల మోత మోగించగా, మరికొన్ని చోట్ల వాహన చోదకులకు అవగాహన కల్పించి, హెచ్చరించి పంపివేశారు. రాజధాని నగరం చెన్నై తో పాటుగా రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి భరతం పట్టేలా కొత్త మోటారు వెహికల్ యాక్ట్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఈ మేరకు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపేవారు, ట్రిబుల్ రైడింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు, సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్ర కారుకు ఇకపై భారీ జరిమానా విధించనున్నారు. అలాగే, రాత్రుల్లో మద్యం తాగి వాహనాలు నడిపే వారి మత్తు దిగేలా కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులే కాదు, లా అండ్ ఆర్డర్ విభాగంలోని ఎస్‌ఐ ఆపైస్థాయి అధికారులు సైతం బుధవారం నుంచి వాహన తనిఖీలపై దృష్టి పెట్టారు. పలు చోట్ల నిబంధనలు అతి క్రమించిన వారికి జరిమానాలు విధించారు.
చదవండి: హనీట్రాప్: ఆమె ఎవరో తెలియదు.. కానీ, అంతా ఆమె వల్లే జరిగింది!
Comments
Please login to add a commentAdd a comment