పార్టీలో బెల్లయ్యనాయక్ సహా పలువురి చేరిక
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి మార్చి 31 దాకా పార్టీ సభ్యత్వం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేత కె.లక్ష్మణ్ తెలిపారు. గురువారం రాష్ట్ర కోర్ కమిటీ, పదాధికారుల సమావేశం ముగిసిన తర్వాత వారు మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. ఆన్‌లైన్ సభ్యత్వం మాత్రమే చేయాలన్న పార్టీ జాతీయ విధానం మేరకు దీనిపైనే పూర్తి గా దృష్టికేంద్రీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ హామీలను నిలబెట్టకునే విధంగా ఒత్తిడి చేస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని శక్తులు మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో పార్టీ శాఖకోసం కలిసికట్టుగా కృషిచేస్తామని వారు చెప్పారు.
బెల్లయ్య సహా పలువురి చేరిక
లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్‌తో పాటు పలువురు నాయకులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సుహాసినీ రెడ్డి, రిటైర్డు ఐపీఎస్ అధికారి గంగాధర్, కాంగ్రెస్ నేత సురేశ్ నాయుడు, లోక్‌సత్తానేత శ్రీనివాసరావు తదితరులు పార్టీలో చేరారు.
ఎస్సీ వర్గీకరణ చేయాలి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేయకుండా మోసం చేసిందని, ఇప్పుడైనా వెంటనే వర్గీకరణ చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసిన మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ కోరారు.
ఆన్‌లైన్‌లో బీజేపీ సభ్యత్వం
Published Fri, Jan 9 2015 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM
Advertisement
Advertisement