టీఆర్ఎస్ సర్కారుపై పోరుకిదే సమయం
• బీజేపీ పదాధికారుల సమావేశంలో లక్ష్మణ్
• నోట్ల రద్దుపై అవగాహనా కార్యక్రమాలకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ పదాధికారులు, పార్టీ జిల్లా శాఖల అధ్య క్షులు, ముఖ్యులతో గురువారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయడంలో టీఆర్‌ఎస్ విఫలమైందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగు తున్నదన్నారు.
టీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలపై పోరాడటానికి ఇదే సమయ మన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టు కుని ప్రజా ఉద్యమాలపై దృష్టిపెట్టాలని పార్టీ శ్రేణులకు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. వెంటనే జిల్లా కమిటీలను పూర్తిచేయాలని అన్నారు. డిసెంబర్ 15లోపు పార్టీ సంస్థాగత వ్యవహారాలను పూర్తిచేయాలన్నారు. రాష్ట్రం లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మ కాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని లక్ష్మణ్ సూచించారు. సమావేశంలో బీజేపీ నాయకులు పి.మురళీధర్‌రావు, పి.కృష్ణ దాసు, రాజా, జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభా కర్, ఎన్.రామచందర్ రావు, నాగం జనా ర్దన్ రెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, నల్లు ఇంద్ర సేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.