బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అరెస్ట్
వరంగల్ అర్బన్: జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ యార్డును సందర్శించడానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ యార్డులో రైతుల కష్టాలను తెలుసుకోవడానికి వచ్చిన లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని నిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.