ఏనుమాముల మార్కెట్ వద‍్ద ఉద్రిక‍్తత
Published Tue, May 2 2017 2:13 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ యార్డులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్కెట్ యార్డును సందర్శించి, పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మార్కెట్ లోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించామంటూ గండ్ర వెంకటరమారెడ్డి సహా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వారిని మిల్స్ కాలనీ స్టేషన్‌కు తరలించారు.
వారం రోజుల తర్వాత మార్కెట్ ప్రారంభం కావడంతో మంగళవారం ఎనమముల మార్కెట్ కు 80 వేల మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో తేజ్ రకానికి రూ. రెండు వేల ధర కూడా రాకపోవడం రైతులు ఇబ‍్బందిపడుతున్నారు. ఓ వైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టా పాస్ బుక్ ఆధార్ కార్డ్ ఉంటేనే లోనికి రానిస్తున్నారు. ఫలితంగా మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే దళారులు మాత్రం మార్కెట్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మిర్చిని తగలబెట్టేందుకు రైతుల యత్నం
ఏనుమాముల మార్కెట్ లో గిట్టు బాటు ధర లేదంటూ రైతులందరూ ఏకమై ఆందోళలకు దిగారు. మార్కెట్ యార్డ్‌లో అమ్మడానికి తీసుకువచ్చిన మిర్చిని కొంత మంది తగలబెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నరు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ రైతులు బిగ్గరగా నినాదాలు చేశారు.
Advertisement