enumamula market
-
Enumamula: ఎనుమాముల ఎండు మిర్చి సెన్సేషన్
సాక్షి, వరంగల్ జిల్లా : మార్కెట్లో ఎండు మిర్చికి ఫుల్ గిరాకీ నడుస్తోంది. దిగుమతి తక్కువ కావడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగిపోతోంది. తాజాగా క్వింటాల్ మిర్చి ధర రూ.80 వేలకు పలికి రికార్డు నెలకొల్పింది. ఎర్రబంగారం ఎండు మిర్చి రికార్డు స్థాయి రేటు రాబట్టింది. తాజాగా ఆసియా ఫేమస్ అయిన వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దేశీ మిర్చి అధిక రేటు పలికింది. క్వింటాల్‌కు ఏకంగా రూ. 80,100 ధర పలికింది. గంటన్నరలోనే 3వేల బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా మార్కెట్ చరిత్రలోనే కాదు.. రికార్డ్ ధరతో, అమ్మకాలతో దేశీయంగా రికార్డు నెలకొల్పిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక గత సెప్టెంబర్‌లోనే ఎండు మిర్చి క్వింటాల్ రూ. 90వేల రేటు పలకడం గమనార్హం. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. ఇక్కడ పత్తి తర్వాత భారీగా వచ్చే పంట మిర్చి. దేశీ కొత్త మిర్చి రకానికి ఫుల్ గిరాకీ ఉంటోంది. -
రైతు మృతి.. మార్కెట్ యార్డులో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో విషాదం చోటు చేసుకుంది. పత్తిని అమ్మేందుకు మార్కెట్‌కు వచ్చిన రైతును లారీ ఢీకొట్టింది. దీంతో రైతు మృతిచెందాడు. పాలకుర్తికి చెందిన బానోతు రవి అనే రైతు పత్తిని విక్రయించేందుకు నిన్న సాయంత్రం మార్కెట్‌కు వచ్చాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న రైతు కాళ్లపై నుంచి మిర్చి లారీ దూసుకెళ్లింది. తోటి రైతులు అతడిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతి చెందడంతో మార్కెట్, ఎంజీఎం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అరెస్ట్
వరంగల్ అర్బన్: జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ యార్డును సందర్శించడానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్కెట్ యార్డులో రైతుల కష్టాలను తెలుసుకోవడానికి వచ్చిన లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని నిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర అధ్యక్షుడు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మార్కెట్ యార్డు వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఏనుమాముల మార్కెట్ వద్ద ఉద్రిక్తత
-
ఏనుమాముల మార్కెట్ వద్ద ఉద్రిక్తత
వరంగల్ : వరంగల్ జిల్లాలోని ఏనుమాముల మార్కెట్ యార్డులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్కెట్ యార్డును సందర్శించి, పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. మార్కెట్ లోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించామంటూ గండ్ర వెంకటరమారెడ్డి సహా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వారిని మిల్స్ కాలనీ స్టేషన్‌కు తరలించారు. వారం రోజుల తర్వాత మార్కెట్ ప్రారంభం కావడంతో మంగళవారం ఎనమముల మార్కెట్ కు 80 వేల మిర్చి బస్తాలు వచ్చాయి. దీంతో తేజ్ రకానికి రూ. రెండు వేల ధర కూడా రాకపోవడం రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఓ వైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టా పాస్ బుక్ ఆధార్ కార్డ్ ఉంటేనే లోనికి రానిస్తున్నారు. ఫలితంగా మార్కెట్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే దళారులు మాత్రం మార్కెట్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్చిని తగలబెట్టేందుకు రైతుల యత్నం ఏనుమాముల మార్కెట్ లో గిట్టు బాటు ధర లేదంటూ రైతులందరూ ఏకమై ఆందోళలకు దిగారు. మార్కెట్ యార్డ్‌లో అమ్మడానికి తీసుకువచ్చిన మిర్చిని కొంత మంది తగలబెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నరు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ రైతులు బిగ్గరగా నినాదాలు చేశారు. -
ఎనుమాముల మార్కెట్లో రైతుల ఆందోళన
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళన నిర్వహించారు. ఐదురోజుల సెలవుల అనంతరం ఈ రోజు మిర్చీ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇన్ని రోజుల నుంచి మిర్చీ అమ్ముకోకుండా అక్కడే వేచి ఉన్న రైతులకు పెద్ద షాక్ తగిలింది. భారీగా మిర్చీ ధర పడిపోవడంతో.. ఆగ్రహించిన రైతులు మార్కెట్ కార్యదర్శి కార్యాలయం ఎదుట పంటకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. -
ఏనుమాముల మార్కెట్లో ఉద్రిక్తత
వరంగల్ అర్బన్: వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మిర్చికి రూ.10 వేలు, కందులకు రూ.8 వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో టీడీపీ నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. అయితే, ఈ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన దీక్ష టెంట్లను తొలగించివేశారు. అయినప్పటికీ తాము దీక్ష చేపట్టి తీరుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. దీంతో మార్కెట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. -
ఏనుమాముల మార్కెట్లో నిలిచిన పత్తి కొనుగోళ్లు
వరంగల్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆసియాలోనే పెద్దదైన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డుపై సైతం పడింది. కొత్త నోట్లు రాకపోవడం, చిల్లర కొరత కారణంగా మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం పత్తి సీజన్ నడుస్తుండగా మార్కెట్‌కు గతంలో కంటే అతి తక్కువగా రైతులు తమ పంట ఉత్పత్తిని తరలిస్తున్నారు. పత్తిని కొన్న అడ్తిదారులు డబ్బుల రూపంలో కాకుండా చెక్కుల రూపంలో ఇస్తున్నారు. ఆ చెక్కులను బ్యాంకుల్లో మార్చుకోలేక, చేతిలో చిల్లిగవ్వ లేక వారు రైతులు పడుతున్నఅవస్థలు వర్ణనాతీతం. కొంతమేరకైనా నగదు రూపంలో ఇస్తే తమ అత్యవసర ఖర్చులకు పనికొస్తాయని అంటున్నారు. -
మార్కెట్లో మక్క రైతుల ఆందోళన
రూ.400ల వరకు తగ్గించిన వ్యాపారులు ఏ పద్ధతిన నిర్ణయించారని ప్రశ్నించిన రైతులు కనపడకుండాపోయిన ఉద్యోగులు పోలీసు బందోబస్తుతో తక్కువ ధరతో కొనసాగిన క్రయవిక్రయాలు వరంగల్ సిటీ: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం మక్క రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాళ్‌కు రూ.1800కు పైచిలుకు పలికిన ధర, ఒక్కసారిగా రూ.1455–1060కు పడిపోవడంతో మక్క రైతుల ఆవేశం కట్టలు తెంచుకుంది. రైతులు పెద్ద ఎత్తున యార్డు వద్దకు చేరుకోని ఏ పద్ధతిన ధరను నిర్ణయించారని, ఎందుకు ధర తగ్గించారో తెలుపాలని అడుగుతుండగానే యార్డు ఇంచార్జితో సహా ఉద్యోగులంతా ఉడాయించారు. సమాధానం చెప్పడానికి ఉద్యోగులు, వ్యాపారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో రైతులకు మరింతగా కోపం వచ్చి.. ఓ దశలో గన్ని బ్యాగులను తగులబెట్టే ప్రయత్నం చేశారు. మార్కెట్ ఉద్యోగులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐలు భీంశర్మ, బాలాజీవరప్రసాద్లు యార్డుకు చేరుకుని, గొడవలు కాకుండా నియంత్రించారు. రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులతో రైతులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఎందుకు ధర తగ్గించారో చెప్పాలని, కనీసం రూ.1500తోనైనా కొనుగోలు చేస్తే తాము ఊరుకుంటామని సీఐ భీంశర్మతో వాదించారు. దీనికి సీఐ సమ్మతించి యార్డు ఇంచార్జీ, ఉద్యోగులను పిలిపించి అడ్తి, వ్యాపారులతో మాట్లాడాలని సూచించారు. అందుకు వ్యాపారులు ససేమిరా అన్నారు. వ్యాపారులతో మాట్లాడి ఒప్పించడానికి అటు కార్యదర్శి, మార్కెట్ చైర్మన్ ఎవరూ ప్రయత్నించ లేదు. చివరకు పోలీసు బందోబస్తుతో తక్కువ ధరతోనే కొనుగోళ్లు నడిచాయి. యార్డు ఇన్చార్జి అత్యుత్సాహంతోనే గొడవ కాగా మక్క రైతుల ఆందోళనకు ప్రధాన కారుకుడు యార్డు ఇంచార్జీనే అని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర నిర్ణయం కాకముందే మైక్‌లో రూ.1555 పెట్టే ధరను రూ.100తగ్గించి 1455కే అనౌన్స్ చేశాడని, దీంతో వ్యాపారులు అనౌ¯Œ్స అయ్యాక ఎట్టి పరిస్థితిలో ధర పెంచేది లేదని, ఒక వేళ పెంచితే ఇక ప్రతి రోజు అలానే ఉంటుందని ఖారాకండిగా తెలిపారు. అసలు ధరకు రూ.100 ఎందుకు తగ్గిం చావని యార్డు ఇంచార్జీని అడిగితే బిత్తర చూపులు తప్పా సమాధానం లేదు. యార్డు ఇంచార్జీ గత రెండు సంవత్సరాలుగా ఒకరిద్దరు అడ్తి దారులను గుప్పెట్లో పెట్టుకోని ఇలానే చేస్తున్నాడని ఉద్యోగులు వాపోయారు. అతడిని మార్చాలని పలవురు ఉద్యోగులు బాహాటంగానే అంటున్నారు. మార్కెట్‌కు రాని చైర్మన్.. నూతనంగా నియమితులైన మార్కెట్ చైర్మ¯ŒS ధర్మరాజు మార్కెట్‌కు రాలేదు. మార్కెట్‌కు బయలుదేరే సమయంలో గొడవ విషయం తెలుసుకుని ఆగిపోయారని పలువురు మాట్లాడు కోవడం కనిపించింది. ఇక మార్కెట్‌కు సుమారు 30వేల బస్తాల మక్కలు అమ్మకానికి వస్తే.. ఉదయం మెసేజ్‌లో 18,471 బస్తాలు వచ్చినట్లు ధర రూ.1445–1060 పలికినట్లు పంపించారు. తీరా మార్కెట్ అధికారికంగా ప్రకటించే ధరల్లో 19వేల బస్తాలు అమ్మకానికి వచ్చినట్లు ధర రూ.1445–1375 పలికినట్లు ధరల పట్టికను పంపించారు. ఈ లెక్కన ఎన్ని క్వింటాళ్ల మక్కలు అమ్మకానికి వచ్చాయో, ఏధర పలికిందో, ఓపె¯ŒS టెండరా...నామ్ విధానమా అనేది మార్కెట్ ఉద్యోగులకే తెలియని పరిస్థితి. మార్కెట్లో అంతా మోసమే మార్కెట్లో మొత్తం ఎటు చూసినా మోసంతో కూడిన వ్యాపారమే. హమాలీ కూలీల నుంచి అడ్తి, వ్యాపారుల వరకు చివరకు ఉద్యోగులతో సహా రైతుల నుంచి ఎంత మేరకు దండుకోవాలనే ఆలోచనే తప్పా మరోటి లేదు. తిరిగి మక్కలను ఇంటికి తీసుకుపోలేక తప్పని సరి పరిస్థితిలో అమ్మకుంటున్నాం. ఏమైనా మాట్లాడితే ఎవరినైనా అడుగుదామంటే పోలీసులు తీసుకుపోతున్నారు. – బానోతు మోతీలాల్, మక్క రైతు