ఏనుమాముల మార్కెట్‌లో ఉద్రిక్తత
Published Mon, Feb 20 2017 3:57 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
వరంగల్ అర్బన్: వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మిర్చికి రూ.10 వేలు, కందులకు రూ.8 వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో టీడీపీ నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. అయితే, ఈ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన దీక్ష టెంట్లను తొలగించివేశారు. అయినప్పటికీ తాము దీక్ష చేపట్టి తీరుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. దీంతో మార్కెట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
Advertisement
Advertisement