సాక్షి, వరంగల్ జిల్లా : మార్కెట్‌లో ఎండు మిర్చికి ఫుల్ గిరాకీ నడుస్తోంది. దిగుమతి తక్కువ కావడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగిపోతోంది. తాజాగా క్వింటాల్ మిర్చి ధర రూ.80 వేలకు పలికి రికార్డు నెలకొల్పింది.
ఎర్రబంగారం ఎండు మిర్చి రికార్డు స్థాయి రేటు రాబట్టింది. తాజాగా ఆసియా ఫేమస్ అయిన వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దేశీ మిర్చి అధిక రేటు పలికింది. క్వింటాల్‌కు ఏకంగా రూ. 80,100 ధర పలికింది. గంటన్నరలోనే 3వేల బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా మార్కెట్ చరిత్రలోనే కాదు.. రికార్డ్ ధరతో, అమ్మకాలతో దేశీయంగా రికార్డు నెలకొల్పిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక గత సెప్టెంబర్‌లోనే ఎండు మిర్చి క్వింటాల్ రూ. 90వేల రేటు పలకడం గమనార్హం.
ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. ఇక్కడ పత్తి తర్వాత భారీగా వచ్చే పంట మిర్చి. దేశీ కొత్త మిర్చి రకానికి ఫుల్ గిరాకీ ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment