red chilli price
-
Enumamula: ఎనుమాముల ఎండు మిర్చి సెన్సేషన్
సాక్షి, వరంగల్ జిల్లా : మార్కెట్లో ఎండు మిర్చికి ఫుల్ గిరాకీ నడుస్తోంది. దిగుమతి తక్కువ కావడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధర అమాంతం పెరిగిపోతోంది. తాజాగా క్వింటాల్ మిర్చి ధర రూ.80 వేలకు పలికి రికార్డు నెలకొల్పింది. ఎర్రబంగారం ఎండు మిర్చి రికార్డు స్థాయి రేటు రాబట్టింది. తాజాగా ఆసియా ఫేమస్ అయిన వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దేశీ మిర్చి అధిక రేటు పలికింది. క్వింటాల్‌కు ఏకంగా రూ. 80,100 ధర పలికింది. గంటన్నరలోనే 3వేల బస్తాలను వ్యాపారులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా మార్కెట్ చరిత్రలోనే కాదు.. రికార్డ్ ధరతో, అమ్మకాలతో దేశీయంగా రికార్డు నెలకొల్పిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక గత సెప్టెంబర్‌లోనే ఎండు మిర్చి క్వింటాల్ రూ. 90వేల రేటు పలకడం గమనార్హం. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. ఇక్కడ పత్తి తర్వాత భారీగా వచ్చే పంట మిర్చి. దేశీ కొత్త మిర్చి రకానికి ఫుల్ గిరాకీ ఉంటోంది. -
మిర్చి మిలమిల.. ఖాళీ అవుతున్న కోల్డ్ స్టోరేజీలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎండు మిర్చి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. మార్కెటింగ్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల నేపథ్యంలో దళారుల ప్రమేయం తగ్గి, వాస్తవ ధరలు రైతులకు అందుతున్నాయి. చీడపీడల కారణంగా ఏడాది పంట దిగుబడులు తగ్గినా.. ధరలు పెరుగుతుండటం రైతన్నలకు ఊరటనిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 341 మిర్చి రకం ధర ఏకంగా క్వింటాల్ రూ.26 వేలకు చేరింది. దీంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన ఎండు మిర్చిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎగబడుతున్నారు. మూడు నెలల్లో రూ.4,500 పెరుగుదల మిర్చి పైరుకు గత ఏడాది తెగుళ్లు సోకడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఇదే సందర్భంలో ఎగుమతులు పెరిగాయి. బంగ్లాదేశ్ వంటి దేశాలకు సైతం ఎగుమతి కావడం, దేశీయంగా డిమాండ్ పెరగడంతో ధరలు ఎగబాకుతున్నాయి. దీంతోపాటు నాణ్యమైన సరుకు లభ్యత తక్కువ ఉండటం ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విదేశాలకు ఎగుమతి అయ్యే తేజ, బాడిగ రకాల మిర్చికి గతంలో అధిక ధర ఉండేది. అందుకు భిన్నంగా ప్రస్తుతం 341 రకం మిర్చికి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ఈ రకం మిర్చి ధర కనీవినీ ఎరుగని రీతిలో ఎగబాకుతోంది. మార్చి నెలలో 341 మిర్చి క్వింటాల్ రూ.21,500 ధర పలికి రికార్డు సృష్టించింది. ఈ ధర క్రమంగా పెరుగుతూ.. ప్రస్తుతం రూ.26 వేలకు చేరింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర రకాలదీ అదే దారి గుంటూరు, నడికుడి, ఖమ్మం, వరంగల్ మార్కెట్లలో నాణ్యత గల అన్ని రకాల మిర్చి ధరలు పెరుగుతున్నాయి. క్వింటాల్‌కు సగటున రూ.20 వేలకు పైగా పలుకుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చిని సైతం కొనేందుకు వ్యాపారులు ఎగబడటంతో సందడి నెలకొంది. ఈ రకానికి డిమాండ్ ఎందుకంటే.. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, కర్నూలు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 341 రకం మిర్చిని సాగు చేస్తారు. చిక్కటి ఎర్ర రంగు కలిగి ఉండే ఈ రకాన్ని కారం తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశీయంగా పచ్చళ్ల తయారీతోపాటు, గృహావసరాలకు వాడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఉత్తర భారతదేశంలో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది. కొత్త పంట నవంబర్ వరకు వచ్చే అవకాశం లేకపోవడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. (క్లిక్: ఒక్క రూపాయికే పక్కా ఇల్లు) ఆశాజనకంగా ధరలు నేను 2020లో రెండెకరాల్లో మిర్చి పంట వేశాను. కరోనా నేపథ్యంలో గిట్టుబాటు ధర లేక కోల్డ్ స్టోరేజీలో ఉంచాను. ప్రస్తుతం మిర్చి ధర ఆశాజనకంగా ఉంది. అందువల్ల విక్రయిస్తున్నాను. గతంలో ఎన్నడూ లేనివిధంగా ధరలు పెరిగాయి. ఎంతో సంతోషంగాఉంది. – వి.శ్రీనివాసరావు, మిర్చి రైతు, సుబ్బాయిగూడెం, పెనుగంచిప్రోలు మండలం -
పసిడితో మిర్చి పోటీ.. క్వింటాల్ రూ. 52 వేలు.. దేశవ్యాప్తంగా ఆల్లైమ్ రికార్డు!
సాక్షి, వరంగల్: మిర్చి పంట బంగారమైంది.. పసిడి రేటును తలదన్నింది. అకాల వర్షాలు, తెగుళ్లతో దిగుబడి తగ్గడం.. ప్రస్తుత సీజన్లో పచ్చళ్లలో ఎక్కువగా దేశీ రకం మిర్చి కారాన్ని వినియోగిస్తుండటం కూడా రేటు పెరిగేందుకు కారణమైంది. బుధవారం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల(తులం) బంగారం ధర రూ.51,989 ఉంటే.. మరో రూ.11 అదనంగా దేశీ మిర్చి రేటు పలికింది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా ధర రూ.52వేలు అత్యధికంగా పలకడం విశేషం. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఇది ఆల్లైమ్ రికార్డు అని మార్కెట్ అధికారులు చెబుతున్నా.. మిర్చి దిగుబడి తగ్గడమే ఈసారి రేట్లు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు.. అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా తామర తెగులుతో వేలాది ఎకరాల్లో పంట చేతికి రాకుండా పోయింది. దీంతో దిగుబడి తగ్గడంతో రైతులకు వచ్చిన పంటలో నాణ్యత ఉన్న మిర్చికి మాత్రమే అత్యధిక ధర పలుకుతోంది. ఇదే కాస్త ఉపశమనంగా మారిందని ఇటు అధికారులు, అటు రైతులు చెబుతున్నారు. అయితే బుధవారం ఏనుమాముల మార్కెట్లోని మిర్చి యార్డుకు 30వేల బస్తాలు వస్తే.. ఇందులో దేశీ మిర్చి రకం 800 బస్తాల వరకు ఉంది. ఇందులో అత్యధిక నాణ్యత ఉన్న ములుగు జిల్లా ఎస్ నగర్‌కు చెందిన బలుగూరి రాజేశ్వర్‌రావు తెచ్చిన ఏడు బస్తాల మిర్చికి క్వింటాల్‌కు రూ.52వేల ధర పెట్టి ఖరీదుదారు లాలా ట్రేడింగ్ కంపెనీ కొనుగోలు చేసింది. ఇక మిగిలిన రకాల మిర్చికి రూ.18వేల నుంచి రూ.35వేల వరకు ధర పలికింది. ఎందుకింత డిమాండ్ అంటే.. ‘దేశీ రకం మిర్చి పంట ఉత్పత్తి చాలా తగ్గింది. అకాల వర్షాలు, తామర తెగులుతో దిగుబడి పడిపోయింది. అదే సమయంలో ఈ మిర్చిని ఎక్కువగా పచ్చళ్లలో వాడుతుండడం.. ఇప్పుడు సీజన్ కూడా కావడంతో ఉన్న కొద్దిపాటి పంటకు అత్యధిక ధర పలుకుతోంది. నాణ్యత ఉన్న మిర్చిని ఖరీదుదారులు ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇంత రేటు వచ్చినా ఇది రైతులకు కంటి తుడుపు చర్య మాదిరిగానే ఉంది. ఎందుకంటే.. వారు రూ.లక్షలు పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాకపోవడంతో ఉన్న కొంత సరుకుకు ఈ ధర వస్తోంది. పెట్టుబడి కూడా పూర్తిగా రావడం లేదని మార్కెట్‌కు వచ్చిన రైతులు వాపోతున్నారు. గతంలో దేశీ మిర్చి క్వింటా ధర రూ.28వేలు పలికింది. ఇప్పుడది రూ.52వేలతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది’ అని మార్కెట్ గ్రేడ్ కార్యదర్శి రాహుల్ ‘సాక్షి’కి తెలిపారు. రెండెకరాలు.. రెండు క్వింటాళ్లపైనే.. మాకున్న రెండెకరాల్లో ఏటా మిర్చి పంట సాగు చేస్తున్నా. అంతకుముందు ఎకరానికి 10 క్వింటాళ్లపైగా దిగుబడి వచ్చేది. ఈసారి ఎకరాకు కొంచెం ఎక్కువగా వచ్చింది. తామర తెగులుతో పంట దిగుబడి తగ్గింది. ఈసారి పెట్టుబడి రూ.5లక్షలు పెడితే.. కేవలం రూ.1,70,000 మాత్రమే వచ్చాయి. దాదాపు రూ.3,30,000 వరకు నష్టపోయాం. ఇంత అత్యధిక ధర రూ.52వేలు వచ్చినా పెద్దగా మాకు వచ్చిన ప్రయోజనమేమీ లేదు. బలుగూరి రాజేశ్వర్‌రావు, మిర్చి రైతు, ఎస్ నగర్, ములుగు జిల్లా -
వరంగల్ లో మిర్చీకి ఆల్ టైం రికార్డ్ ధర
-
క్వింటాల్ మిర్చికి రూ.5వేలు మద్దతు ధర
న్యూఢిల్లీ: రైతుల సమస్యలు, పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసిన రైతుదీక్షకు కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. క్వింటా మిర్చికి కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు మద్దతు ధర ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. క్వింటా మిర్చి ధర రూ.5వేలుగా నిర్ణయించి, ఓవర్ హెడ్ ఛార్జెస్ కింద రూ.1250 అదనంగా చెల్లించనుంది. పంటను రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో 88,300 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 33,700 మెట్రిక్ టన్నుల మిర్చి కొనుగోలు చేయనుంది. మే 2 నుంచి 31 వరకూ చేసే కొనుగోళ్లుకు ఈ తాజా నిర్ణయం వర్తించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రులు రాధా మోహన్ సింగ్, వెంకయ్య నాయుడు వెల్లడించారు. అయితే కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉండాలనేది ఆయా రాష్ట్రలు ప్రభుత్వాలు నిర్ణయిస్తాయని, ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లితే 50-50 శాతం భరించాలని తెలిపారు. కాగా మద్దతు ధర, గిట్టుబాటు ధరలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిర్లక్ష్యం, రుణమాఫీ మోసానికి నిరసనగా, రైతులకు మద్దతు పలుకుతూ సోమ, మంగళ వారాల్లో రెండు రోజుల పాటు గుంటూరు నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు సమీపంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. .@MVenkaiahNaidu @BJP4Andhra @BJP4Telangana @MIB_India @PIB_India @Spices_Board Under MIS, we are providing Rs.5000/qtl support to #chilli growers in the states, and addl Rs.1250/qtl for packaging. — Radha Mohan Singh (@RadhamohanBJP) 3 May 2017