ఏనుమాముల మార్కెట్‌లో నిలిచిన పత్తి కొనుగోళ్లు
Published Tue, Nov 22 2016 10:50 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
వరంగల్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆసియాలోనే పెద్దదైన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డుపై సైతం పడింది. కొత్త నోట్లు రాకపోవడం, చిల్లర కొరత కారణంగా మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం పత్తి సీజన్ నడుస్తుండగా మార్కెట్‌కు గతంలో కంటే అతి తక్కువగా రైతులు తమ పంట ఉత్పత్తిని తరలిస్తున్నారు. పత్తిని కొన్న అడ్తిదారులు డబ్బుల రూపంలో కాకుండా చెక్కుల రూపంలో ఇస్తున్నారు. ఆ చెక్కులను బ్యాంకుల్లో మార్చుకోలేక, చేతిలో చిల్లిగవ్వ లేక వారు రైతులు పడుతున్నఅవస్థలు వర్ణనాతీతం. కొంతమేరకైనా నగదు రూపంలో ఇస్తే తమ అత్యవసర ఖర్చులకు పనికొస్తాయని అంటున్నారు.
Advertisement