![Kodandaram Arrest Protest Against Uranium Mining At Achampet In Nagarkurnool District - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/3/kondaram-arrest.jpg.webp?itok=sNRChxWV)
సాక్షి, నాగర్‌కర్నూల్ : అచ్చంపేట మండలం నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించేందుకు వెళ్తున్న టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన హజీపూర్ చౌరస్తా వద్దకు చేరుకోగానే అరెస్టు చేశారు. ఆయన అరెస్టుకు నిరసనగా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులు, పదర, అమ్రాబాద్ మండలాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. యురేనియం వెలికితీత వల్ల వాటిల్లే నష్టాల గురించి ప్రజలతో చర్చించడానికి వచ్చిన కోదండరామ్ బృందాన్ని అక్రమంగా అరెస్టు చేయడం సరైందని కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment