నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం గుట్టపై మైనింగ్‌పై నిరసనలు
ఊరికి ముప్పుగా ఉన్న మైనింగ్‌ను ఆపేందుకు గ్రామస్తుల పోరాటం
ఫోర్జరీ సంతకాలతో గతంలో అనుమతులు పొందినట్టు ఆరోపణలు
ఏళ్లుగా గ్రామస్తుల గోస పట్టని అధికారులు
సాక్షి, నాగర్‌కర్నూల్: చుట్టూ నల్లమల (Nallamala) అటవీప్రాంతం.. కొండలు, గుట్టల నడుమ పచ్చని పొలాలతో అలరారుతున్న ఆ ఊరికి గనులు శాపంగా పరిణమించాయి. గ్రామానికి ఆనుకునే ఉన్న గుట్టపై క్వార్ట్జ్ కోసం సాగుతున్న మైనింగ్ (Mining) తవ్వకాలు ఏకంగా ఆ ఊరినే ఉనికి లేకుండా చేస్తాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బ్లాస్టింగ్‌లతో ఇళ్లు, గ్రామానికి ముప్పు ఉందని, మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా పోరాటానికి దిగుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం(mailaram) గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై ఊరంతా పోరాడుతోంది. మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా గత పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు కూడా. ఇటీవల గ్రామస్తులు రిలే నిరాహార దీక్షకు దిగగా, అనుమతి లేదంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో మైనింగ్ అనుమతులు రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని గ్రామస్తులు కంకణం కట్టుకున్నారు.
200 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు ముప్పు
మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై క్వార్ట్జ్, ఫెల్‌స్పార్ ఖనిజ తవ్వకాలకు మైనింగ్ శాఖ 2017లో అనుమతులు జారీ చేసింది. గుట్టపై సర్వే నంబరు 120/1లో 24.28 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అవకాశం కల్పించింది. అయితే మైనింగ్ జరిగే ప్రాంతానికి 200 మీటర్ల సమీపంలోనే ఇళ్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. గ్రామంలో సుమారు 540 కుటుంబాలు, 1,850 మంది వరకు జనాభా ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలు ఏళ్లుగా గుట్టకు ఆనుకునే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. గుట్టపై పురాతన నరసింహస్వామి, శివాలయాలు సైతం ఉన్నాయి. మైనింగ్ కోసం జరుపుతున్న పేలుళ్లతో సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సర్వే నంబరు 120/1లో 24.28 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అవకాశం కల్పించింది. అయితే మైనింగ్ జరిగే ప్రాంతానికి 200 మీటర్ల సమీపంలోనే ఇళ్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. గ్రామంలో సుమారు 540 కుటుంబాలు, 1,850 మంది వరకు జనాభా ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలు ఏళ్లుగా గుట్టకు ఆనుకునే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. గుట్టపై పురాతన నరసింహస్వామి, శివాలయాలు సైతం ఉన్నాయి. మైనింగ్ కోసం జరుపుతున్న పేలుళ్లతో సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఫోర్జరీ సంతకాలతో గ్రామసభ తీర్మానం
గ్రామ పంచాయతీ పరిధిలో మైనింగ్ తవ్వకాల కోసం గ్రామసభ తీర్మానం కీలకం కాగా, ఈ విషయం గ్రామస్తులకే తెలియకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామసభ తీర్మానం కాపీ వెలుగులోకి వచ్చింది. తీర్మానంలో గ్రామస్తులకు తెలియకుండానే పాలకవర్గం, కొందరు గ్రామస్తుల పేరుతో సంతకాలను ఫోర్జరీ చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మైనింగ్ కోసం అనుమతులు ఉన్నాయని, గ్రామస్తుల ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి సమీక్షిస్తామని జిల్లా మైనింగ్ అధికారి రవీందర్ తెలిపారు.
చదవండి: చరిత్రకు సాజీవ సాక్ష్యం రాజకోట
మా ఊరే లేకుండా పోతుంది..
మా ఇళ్ల పక్కనే బ్లాస్టింగ్ చేస్తుంటే మేం ఎక్కడికి పోవాలి? మైనింగ్‌తో మా ఊరే లేకుండా పోతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు మైనింగ్ నిర్వాహకులకే అండగా ఉంటున్నారు. మా బాధ ఎవరికీ పట్టడం లేదు. మైనింగ్ ఆపకపోతే మేమంతా నిరాహార దీక్ష చేసైనా ఊరిని కాపాడుకుంటాం.
– గాయత్రి, మైలారం
Comments
Please login to add a commentAdd a comment