mailaram
-
గనులే ఆ ఊరికి శాపం.. మైలారం మాయమయ్యే ముప్పు!
సాక్షి, నాగర్‌కర్నూల్: చుట్టూ నల్లమల (Nallamala) అటవీప్రాంతం.. కొండలు, గుట్టల నడుమ పచ్చని పొలాలతో అలరారుతున్న ఆ ఊరికి గనులు శాపంగా పరిణమించాయి. గ్రామానికి ఆనుకునే ఉన్న గుట్టపై క్వార్ట్జ్ కోసం సాగుతున్న మైనింగ్ (Mining) తవ్వకాలు ఏకంగా ఆ ఊరినే ఉనికి లేకుండా చేస్తాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బ్లాస్టింగ్లతో ఇళ్లు, గ్రామానికి ముప్పు ఉందని, మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా పోరాటానికి దిగుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం మైలారం(mailaram) గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై ఊరంతా పోరాడుతోంది. మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా గత పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారు కూడా. ఇటీవల గ్రామస్తులు రిలే నిరాహార దీక్షకు దిగగా, అనుమతి లేదంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో మైనింగ్ అనుమతులు రద్దు చేసేవరకు పోరాటం చేస్తామని గ్రామస్తులు కంకణం కట్టుకున్నారు.200 మీటర్ల దూరంలో ఉన్న ఇళ్లకు ముప్పు మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై క్వార్ట్జ్, ఫెల్స్పార్ ఖనిజ తవ్వకాలకు మైనింగ్ శాఖ 2017లో అనుమతులు జారీ చేసింది. గుట్టపై సర్వే నంబరు 120/1లో 24.28 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అవకాశం కల్పించింది. అయితే మైనింగ్ జరిగే ప్రాంతానికి 200 మీటర్ల సమీపంలోనే ఇళ్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. గ్రామంలో సుమారు 540 కుటుంబాలు, 1,850 మంది వరకు జనాభా ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలు ఏళ్లుగా గుట్టకు ఆనుకునే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. గుట్టపై పురాతన నరసింహస్వామి, శివాలయాలు సైతం ఉన్నాయి. మైనింగ్ కోసం జరుపుతున్న పేలుళ్లతో సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సర్వే నంబరు 120/1లో 24.28 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అవకాశం కల్పించింది. అయితే మైనింగ్ జరిగే ప్రాంతానికి 200 మీటర్ల సమీపంలోనే ఇళ్లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన రేగుతోంది. గ్రామంలో సుమారు 540 కుటుంబాలు, 1,850 మంది వరకు జనాభా ఉంది. వీరిలో కొన్ని కుటుంబాలు ఏళ్లుగా గుట్టకు ఆనుకునే ఇళ్లను నిర్మించుకుని జీవిస్తున్నారు. గుట్టపై పురాతన నరసింహస్వామి, శివాలయాలు సైతం ఉన్నాయి. మైనింగ్ కోసం జరుపుతున్న పేలుళ్లతో సమీపంలోని ఇళ్లలో ఉంటున్నవారు భయభ్రాంతులకు లోనవుతున్నారు. మైనింగ్ అనుమతులను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫోర్జరీ సంతకాలతో గ్రామసభ తీర్మానం గ్రామ పంచాయతీ పరిధిలో మైనింగ్ తవ్వకాల కోసం గ్రామసభ తీర్మానం కీలకం కాగా, ఈ విషయం గ్రామస్తులకే తెలియకపోవడం గమనార్హం. సమాచార హక్కు చట్టం ద్వారా గ్రామసభ తీర్మానం కాపీ వెలుగులోకి వచ్చింది. తీర్మానంలో గ్రామస్తులకు తెలియకుండానే పాలకవర్గం, కొందరు గ్రామస్తుల పేరుతో సంతకాలను ఫోర్జరీ చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మైనింగ్ కోసం అనుమతులు ఉన్నాయని, గ్రామస్తుల ఫిర్యాదు నేపథ్యంలో మరోసారి సమీక్షిస్తామని జిల్లా మైనింగ్ అధికారి రవీందర్ తెలిపారు. చదవండి: చరిత్రకు సాజీవ సాక్ష్యం రాజకోటమా ఊరే లేకుండా పోతుంది.. మా ఇళ్ల పక్కనే బ్లాస్టింగ్ చేస్తుంటే మేం ఎక్కడికి పోవాలి? మైనింగ్‌తో మా ఊరే లేకుండా పోతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు మైనింగ్ నిర్వాహకులకే అండగా ఉంటున్నారు. మా బాధ ఎవరికీ పట్టడం లేదు. మైనింగ్ ఆపకపోతే మేమంతా నిరాహార దీక్ష చేసైనా ఊరిని కాపాడుకుంటాం. – గాయత్రి, మైలారం -
నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత
-
మైలవరంలో నారా భువనేశ్వరికి చేదు అనుభవం
-
మైలారం పరిధిలో చిరుత పులి కలకలం
-
కరెంట్ కోసం ఆందోళనకు దిగిన మైలారం గ్రామస్థులు
-
హత్యకు ప్రతీకారంగా ఇళ్లపై దాడులు
-
బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
ధారూర్: గమ్యానికి దగ్గరగా వచ్చానని ఫోన్ చేసి చెప్పిన యువతి ఆ వెంటనే రైలు ప్రమాదా నికి గురైంది. రైల్వే స్టేషన్‌కు వచ్చి యువతి కోసం నిరీక్షించిన కుటుంబీకులు ఆమె రాకపోవ డంతో రాత్రంతా రైలు పట్టాల వెంట వెదికారు. ఉదయాన్నే పట్టాల పక్కనే మృత్యువుతో పోరాడుతూ కనిపించిన కూతుర్ని బతికించుకునేందుకు తల్లి, ఇతర కుటుంబీకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటన ధారూర్ మండలంలోని మైలారం రైల్వేస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కుటుంబీ కులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన కాశమ్మ, మల్లికార్జున్ దంపతుల మూడో కూతురు అల్లాపురం జ్యోతి (21) రంగారెడ్డి జిల్లా లింగంపల్లిలోని గ్రీన్‌ట్రెండ్స్ బ్యూటీ పార్లర్లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. జ్యోతి కుటుంబం బతుకు దెరువు కోసం ఇరవయ్యేళ్ల క్రితమే తాండూరుకు వచ్చి స్థిరపడింది. జ్యోతి రోజూ ఉదయం రైలులో లింగంపల్లి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని బీజాపూర్ ప్యాసింజర్‌లో ఇంటికి బయలుదేరింది. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామం లో ఉంటున్న అమ్మమ్మ ఇంటి వద్ద ఆదివారం రాత్రి ఫంక్షన్ ఉండటంతో అక్కడికి వెళ్లడానికి తన చెల్లెలు ఉమకు ఫోన్ చేసింది. వికారాబాద్ దాటాను.. అరగంటలో రుక్మాపూర్ రైల్వేస్టేషన్‌కు వస్తాను.. బైక్‌ను పంపిం చమని చెప్పింది. బైక్‌ను తీసుకుని రైల్వేస్టేషన్‌కు వచ్చిన మేనమామ కొడుకు రైలు వెళ్లిపోయినా జ్యోతి రాకపోవడంతో ఇంటికి వెళ్లి కుటుంబీకులకు చెప్పాడు. ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నా లేపకపోవ డంతో అనుమానం వచ్చి తెల్లవారే వరకు రైలు పట్టాల వెంట వెదికారు. రుక్మాపూర్–మైలారం స్టేషన్ల మధ్య మైలారం చివరి ఫ్లాట్‌ఫాం వద్ద ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. వెంటనే పుష్పుల్ రైలులో వికారాబాద్‌కు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. యువతి పరిస్థితిని గమనించిన వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా చేవెళ్ల దగ్గర జ్యోతి తుదిశ్వాస వదిలింది. ఈ ఘటనపై జ్యోతి తల్లి కాశమ్మ వికారాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జ్యోతి ప్రేమికుడిపై అనుమానం... రైలులో వస్తున్న జ్యోతి రుక్మాపూర్ స్టేషన్లో దిగాల్సి ఉండగా రెండు స్టేషన్ల ముందే రైల్లోంచి ఎలా దూకుతుందనే అనుమా నాన్ని కుటుంబీకులు వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రేమిస్తున్న ఓ యువకుడు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడన్నారు. రైలు ప్రయాణంలో జ్యోతి వెంట అతనూ ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతికి ఫోన్ చేస్తే లేపట్లేదని.. తమకు ఫోన్ చేయడంపై అనుమానం బలపడుతుందని వారు పేర్కొన్నారు. తన అక్క ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని జ్యోతి చెల్లెలు వాపోయింది. -
మైలారం గుహల్లో స్పీకర్
గణపురం: వరంగల్ జిల్లా గణపురం మండలంలోని మైలారం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనున్న గుట్టపైన ఉన్న పురాతన గుహలను రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధు సూదనాచారి శనివారం సందర్శించారు. గుహల గుట్ట వద్దకు దారి లేనందున స్పీకర్ వాహనం వెళ్లలేకపోయింది. దీంతో ఆయన పోలీసు వాహనంలో కొంత దూరం వెళ్లి, అనంతరం కాలినడకన గుహలను చేరుకున్నారు. స్పీకర్ గుహల్లో కొంత దూరం నడిచి వెళ్లారు. చీకటిగా ఉండడం మూలంగా లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించలేదు. కాకతీయగడ్డ మీద ప్రతి చెట్టుకు, ప్రతిగడ్డకు,ప్రతి బిడ్డకు చరిత్ర ఉంటుందని స్పీకర్ ఈ సందర్భంగా అన్నారు. పురావస్తు శాఖ అధికారులు, ప్రభుత్వాలు ఈ గుహలపై ప్రత్యేక దృష్టి సారించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. -
వరంగల్ జిల్లాలో శిలాయుగం ఆనవాళ్లు
హైదరాబాద్: వరంగల్ జిల్లా గణపురం మండలం మైలారంలో శిలాయుగం నాటి పురాతన గుహల సముదాయం ఒకటి వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్రపై పరిశోధనలు జరుపుతున్న బృందం ఈ ప్రాంతాన్ని ఇటీవల సందర్శించింది. దీనిపై వారు విస్తృత పరిశోధనలు జరిపి వివరాలను వెల్లడించారు. మండలంలోని నల్లగుట్టల ప్రాంతంలో 30కి పైగా ఇలాంటి గుహలున్నాయి. క్వార్ట్జ్ ఫెలిస్పాటిక్, కార్బొనేట్ రాళ్లతో ఏర్పడిన శిలాకృతులు ఈ గుహల్లో కనువిందు చేస్తున్నాయి. బొర్రా, బెలూం గుహలకు ఏమాత్రం తీసిపోని విధంగా లోపలి వాతావరణం చల్లగా ఉంది. ఖాళీగా ఉన్న నాలుగు చోట్ల మానవ నిర్మిత రాతి గోడలున్నాయి. గుట్టపై నుంచి లోపలికి దారితీసే సొరంగాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ఆదిమానవులు జీవించారనేందుకు ఆనవాళ్లుగా నీటి వనరుల జాడలు, రాతి పనిముట్లు దొరికాయి. ఇవి రాతి యుగానికి(50,000-30,000 సంవత్సరాల నాటివి) చెందినవని పరిశోధకుల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిశోధనలు జరిపిన బృందంలో రామోజు హరగోపాల్, వేముగంటి మురళీ కృష్ణ, నందకృష్ణ, కట్టా శ్రీనివాస్, అమ్మ కిశోర్, గుర్రాల సుమన్‌రెడ్డిలు ఉన్నారు.