బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి  | Beautician Suspicious Death in vikarabad | Sakshi
Sakshi News home page

బ్యూటీషియన్‌ అనుమానాస్పద మృతి 

Published Tue, Apr 17 2018 2:50 AM | Last Updated on Tue, Apr 17 2018 2:50 AM

Beautician Suspicious Death in vikarabad - Sakshi

ధారూర్‌: గమ్యానికి దగ్గరగా వచ్చానని ఫోన్‌ చేసి చెప్పిన యువతి ఆ వెంటనే రైలు ప్రమాదా నికి గురైంది. రైల్వే స్టేషన్‌కు వచ్చి యువతి కోసం నిరీక్షించిన కుటుంబీకులు ఆమె రాకపోవ డంతో రాత్రంతా రైలు పట్టాల వెంట వెదికారు. ఉదయాన్నే పట్టాల పక్కనే మృత్యువుతో పోరాడుతూ కనిపించిన కూతుర్ని బతికించుకునేందుకు తల్లి, ఇతర కుటుంబీకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటన ధారూర్‌ మండలంలోని మైలారం రైల్వేస్టేషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. కుటుంబీ కులు, రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన కాశమ్మ, మల్లికార్జున్‌ దంపతుల మూడో కూతురు అల్లాపురం జ్యోతి (21) రంగారెడ్డి జిల్లా లింగంపల్లిలోని గ్రీన్‌ట్రెండ్స్‌ బ్యూటీ పార్లర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది.

జ్యోతి కుటుంబం బతుకు దెరువు కోసం ఇరవయ్యేళ్ల క్రితమే తాండూరుకు వచ్చి స్థిరపడింది. జ్యోతి రోజూ ఉదయం రైలులో లింగంపల్లి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకునేది. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని బీజాపూర్‌ ప్యాసింజర్‌లో ఇంటికి బయలుదేరింది. పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌ గ్రామం లో ఉంటున్న అమ్మమ్మ ఇంటి వద్ద ఆదివారం రాత్రి ఫంక్షన్‌ ఉండటంతో అక్కడికి వెళ్లడానికి తన చెల్లెలు ఉమకు ఫోన్‌ చేసింది. వికారాబాద్‌ దాటాను.. అరగంటలో రుక్మాపూర్‌ రైల్వేస్టేషన్‌కు వస్తాను.. బైక్‌ను పంపిం చమని చెప్పింది. బైక్‌ను తీసుకుని రైల్వేస్టేషన్‌కు వచ్చిన మేనమామ కొడుకు రైలు వెళ్లిపోయినా జ్యోతి రాకపోవడంతో ఇంటికి వెళ్లి కుటుంబీకులకు చెప్పాడు. ఫోన్‌ చేస్తే రింగ్‌ అవుతున్నా లేపకపోవ డంతో అనుమానం వచ్చి తెల్లవారే వరకు రైలు పట్టాల వెంట వెదికారు. రుక్మాపూర్‌–మైలారం స్టేషన్ల మధ్య మైలారం చివరి ఫ్లాట్‌ఫాం వద్ద ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. వెంటనే పుష్‌పుల్‌ రైలులో వికారాబాద్‌కు తీసుకొచ్చి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. యువతి పరిస్థితిని గమనించిన వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అంబులెన్స్‌లో తరలిస్తుండగా చేవెళ్ల దగ్గర జ్యోతి తుదిశ్వాస వదిలింది. ఈ ఘటనపై జ్యోతి తల్లి కాశమ్మ వికారాబాద్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

జ్యోతి ప్రేమికుడిపై అనుమానం...
రైలులో వస్తున్న జ్యోతి రుక్మాపూర్‌ స్టేషన్‌లో దిగాల్సి ఉండగా రెండు స్టేషన్ల ముందే రైల్లోంచి ఎలా దూకుతుందనే అనుమా నాన్ని కుటుంబీకులు వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా ప్రేమిస్తున్న ఓ యువకుడు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడన్నారు. రైలు ప్రయాణంలో జ్యోతి వెంట అతనూ ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతికి ఫోన్‌ చేస్తే లేపట్లేదని.. తమకు ఫోన్‌ చేయడంపై అనుమానం బలపడుతుందని వారు పేర్కొన్నారు. తన అక్క ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని జ్యోతి చెల్లెలు వాపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement